ప్రజల కోసం దీక్ష విరమించు: జగన్‌కు విజయమ్మ లేఖ

ఇందుకు సంబంధించి ఆ పార్టీ జగన్‌కు దీక్ష విరమించాలని కోరుతూ లేఖ రాశారు. జగన్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని, ఆయన ఆరోగ్య పరిస్థితి తమకు ఆందోళన కలిగిస్తోందని విజయమ్మ అన్నారు. జగన్ దీక్ష విరమించాలని తాను లేఖ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం కోసమైన దీక్ష విరమించాలని, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి చూస్తుంటే బాధ కలిగిస్తోందన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చి ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. తమ రాజీనామాలతోనైనా అధికార పార్టీలో మార్పు వస్తుందని ఆశించామన్నారు. ఫలితం లేకపోవడంతో విజయమ్మ దీక్ష చేశారని, ఆమె దీక్షను భగ్నం చేసినందుకు జగన్ జైల్లో దీక్ష ప్రారంభించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనగ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉందన్నారు.
అందుకే తాము ఆయనను దీక్ష విరమించాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసమైనా జగన్ దీక్ష విరమించాలన్నారు. ఆయన ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. కాగా, పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ షర్మిల బస్సు యాత్ర పైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications