పదవిలో ఉండలేను: యనమల రాజీనామా, వ్యక్తిగతం

yanamala ramakrishnudu
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన శాసన మండలి సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. తాను సీమాంధ్ర ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని, 30 రోజులుగా తమ ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.

విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో పరిణామాలు తనను బాధించాయన్నారు. సీమాంధ్రలో ఘటనలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీనే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజేస్తే, కాంగ్రెసు పార్టీ దానికి ఆజ్యం పోస్తూ వచ్చిందన్నారు.

ఏళ్లుగా ఉన్న సమస్యను కాంగ్రెసు పార్టీ పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగలేనన్నారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. సీమాంధ్రలో తమ ప్రజల ఆందోళనకు సంఘీభావంగా తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

పార్లమెంటును స్తంభింపచేస్తాం: మోదుగుల

తాము సీమాంధ్రులకు న్యాయం చేయాలని పార్లమెంటును స్తంభింపచేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నారు. నాడు తెలంగాణలో, నేడు సీమాంధ్రలో విద్యార్థులు చనిపోతున్నారని, వాటిని ఆపాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీ పైన ఉందన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+