వచ్చారు... ఎత్తుకెళ్లారు: 5 నిమిషాల్లో మూడుకార్లు చోరీ

 Four men steal three cars in five minutes
ముంబై: మూడు లగ్జరీ కార్లను నలుగురు వ్యక్తులు ఐదు నిమిషాల్లో దొంగిలించుకుపోయిన సంఘటన మహారాష్ట్ర రాజధాని మంబైలో జరిగింది. రూ.25 లక్షలకు పైగా విలువ చేసే మూడు కార్లను ఈ నెల 24వ తేదిన వారు ఐదే నిమిషాల్లో దొంగిలించుకుపోయారు. ఈ ఘటన అంధేరీ తూర్పులో జరిగింది.

రాజ్ కుమార్ అనే వ్యక్తి తన కారును ఉదయం ఐదు గంటలకు ఐదు నిమిషాల ముందు తాను పని చేసే అద్దెకార్ల కంపెనీలో కార్లను శుభ్రం చేస్తున్నాడు. అప్పుడే అటుగా హోండా కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తమ కారును శుభ్రం చేయమని కోరారు.

అతని దగ్గర తాళాలు లాక్కొని ముగ్గురు వ్యక్తులు మూడు ఎస్‌యువిలను స్టార్ట్ చేశారు. ఏం జరుగుతుందో ఊహించేలోగా రాజ్ కుమార్‌ను వారు తమ కారులో ఎక్కమన్నారు. కొద్ది దూరం వెళ్లాక అతనిని కారులోంచి తోసేశారు. అంతా కేవలం ఐదు నిమిషాల్లో జరిగింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉదయం గం.4.54 నిమిషాలకు రాజ్ కుమార్ కార్లను శుభ్రం చేస్తుండగా వచ్చిన దొంగలు, గం.4.56 నిమిషాలకు కార్లు స్టార్ట్ చేశారు. గం.4.59 నిమిషాలకు హైవే పైన అతనిని కారులోంచి కిందకు తోసేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+