ముంబై ఫోటో జర్నలిస్ట్ రేప్: నిందితుడిపై గుడ్లతో దాడి
ముంబై/హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఫోటో జర్నలిస్టు పైన జరిగిన సామూహిక అత్యాచార కేసు నిందితుడి మీద కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులోని ఐదుగురు నిందితులను ముంబై పోలీసులు కోర్టుకు తరలించారు.
వారు కోర్టు వెలుపల ఉన్న సమయంలో పలువురు నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి పైన గుడ్లు విసిరారు. వారి పైన గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి చేసే ప్రయత్నాలు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే, అందుకు సంబంధించిన సమాచారమేమీ లేదు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాతికేళ్లకు పట్టుబడిన ఖైదీ
చర్లపల్లి జైలు నుంచి పెరోల్ పైన బయటకు వచ్చి పరారైన ఓ నిందితుడు దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత పట్టుబడిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరుకు చెందిన గోకరాజు నర్సరాజు అనే ఖైదీ 1989లో పెరోల్ పైన జైలు నుంచి బయటకు వచ్చాడు. అతడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ మందులు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
హైదరాబాదు నగరంలో నకిలీ మందులను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుండి మూడు టన్నుల మందులను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications