'రూపాయి'పై ప్రధాని ఆందోళన, గోల్డ్ కొనుగోలుపై సలహా

కరెంటు ఖాతా లోటు రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని, కరెంటు ఖాతా లోటు నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముడి చమురు ధర పెరుగుదలతో దిగుమతి భారం మరింత పెరిగిందన్నారు. బంగారం అధిక కొనుగోలును తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత దేశంలో ద్రవ్యోల్భణం అధికంగా ఉందని, గత కొద్ది రోజులుగా వృద్ధి రేటు మందగించిందని చెప్పారు. ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన చెప్పారు. కరెంటు ఖాతా లోటును డెబ్బై బిలియన్ డాలర్లకు పరిమితం చేస్తామన్నారు. ఆర్‌బిఐ, ప్రభుత్వం రూపాయి పతనంపై చర్యలు తీసుకుంటోందన్నారు.
విపక్షాల మండిపాటు
ప్రధానమంత్రి ప్రకటన పైన విపక్షాలు మండిపడ్డాయి. ఆయన ప్రకటన చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications