8 చోట్ల రెక్కీ: రాత్రి నిద్రలేని భత్కల్, 12 రాష్ట్రాల విజ్ఞప్తి

వారిని ఢిల్లీ పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టారు. బీహార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. బీహార్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతోందన్నారు.
అంతకుముందు వారికి బీహార్‌లోని మోతీహారి జిల్లా న్యాయస్థానం మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండును విధించింది. కాగా, హైదరాబాదులో పేలుళ్లు జరిపేందుకు భత్కల్, అక్తర్‌లు కలిసి ఎనిమిది చోట్ల రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో పాటు బీహార్ బుద్ధగయ పేలుళ్లలోను వీరి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బుద్దగయ పేలుళ్లలో వీరి పాత్రను అధికారులు ఖండిస్తున్నారు.
హైదరాబాదులో పలు రెక్కీ నిర్వహించిన వీరిని నగరానికి తీసుకు వచ్చేందుకు ఎపి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గురువారం రాత్రి యాసిన్ భత్కల్ పాట్నా జైలులో నిద్రలేమితో గడిపినట్లుగా బీహార్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం ఎన్ఐఏ అదికారులు భత్కల్‌ను ప్రశ్నించారు. తదపరి విచారణకు భత్కల్‌ను ఢిల్లీకి తరలించారు. భత్కల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి పన్నెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications