ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టి యువతికి వేధింపు, ఫ్యామిలికీ

అంతేకాకుండా ఆ యువతిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. మియాపూర్‌కు చెందిన బాధిత యువతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ముంబై ఘటన నిందితుడిపై కోర్టులో దాడి
ముంబైలో ఇటీవల ఫోటో జర్నలిస్టు పైన జరిగిన సామూహిక అత్యాచారం కేసు నిందితులను పోలీసులు శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపర్చే సమయంలో ఓ నిందితుడి పైన కోర్టు ఆవరణలో గొడ్డలితో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
తిరుపతిలో ఎక్సేంజ్ దహనానికి యత్నం
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని విద్యానగర్‌లో టెలిఫోన్ ఎక్ఛెంజ్ దహనానికి కొందరు దుంగులు యత్నించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో పెట్రోల్ బాటిళ్లు లభ్యమయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications