తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డప్పు కొట్టిన డాలర్ శేషాద్రి: తిరుపతి పోరు ఫోటోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుమల: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉద్యోగులు ఆందోళనకు దిగారు. శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సాధారణంగా బయటకు రాని డాలర్ శేషాద్రి కూడా విభజనను వ్యతిరేకిస్తూ డప్పు కొట్టారు. తిరుమలకు విఐపీలు వస్తే, వారిని కలుసుకుని దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన శుక్రవారం డప్పు కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తిరుపతిని 48 గంటల పాటు దిగ్బంధించే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం కూడా నగరాన్ని సమైక్య వాదులు ర్యాలీలు, ఆందోళనలు, రాస్తారోకోలతో దిగ్బంధించారు. టిటిడి యూనియన్ నేతలతో కలిసి సమైక్య వాదులు దేవస్థానం పరిపాలన భవనాన్ని దిగ్బంధించారు. లోపల విధులు నిర్వహిస్తున్న కొంత మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపారు.

బయట ప్రాంతాల నుంచి తిరుపతిలోకి ఎటువంటి వాహనాలనూ ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సమైక్య వాదులు మోటర్ సైకిళ్ళ ర్యాలీ నిర్వహించి రోడ్లపైకొచ్చిన ఆటోలకు, నాలుగు చక్రాల వాహనాల టైర్లకు గాలితీశారు. షాపులు, హోటళ్ళు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి యాత్రికులను టీటీడీ అధికారులు 16 ఉచిత బస్సుల్లో అలిపిరి వరకు తరలించారు. వారికి ఉదయం పాలు, టిఫిన్, మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు.

అలిపిరి నుంచి ఆర్టీసీ 107 బస్సులను తిరుమలకు నడిపింది.రుయాస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఓపీ సేవలు బందయ్యాయి. బయట నుంచి వాహనాలు రాక పోవడంతో అలిపిరి చెక్ పాయింట్‌తో పాటు తిరుపతిలోని ప్రధాన రోడ్లు బోసిపోయాయి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమైక్య వాదులతో కలసి తెలుగుభాషాభిమానులు తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకొన్నారు.

వికలాంగుడి వాహనం ర్యాలీ

వికలాంగుడి వాహనం ర్యాలీ

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో నినదిస్తూ ఓ వికలాంగుడు వాహనంపై స్వారీ చేశాడు. సైకిల్‌కు జాతీయ జెండాను కట్టుకుని అతను సమైక్యాంధ్ర నినాదాలు చేశాడు.

తిరుమలేశుడికీ తప్పలేదు..

తిరుమలేశుడికీ తప్పలేదు..

రాష్ట్ర విభజన కష్టాలు తిరుమలేశుడికి కూడా తప్పలేదు. శుక్రవారంనాడు టిటిడి ఉద్యోగులు తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి వేషధారణలో ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు.

తిరుమలేశుడు జై సమైక్యాంధ్ర...

తిరుమలేశుడు జై సమైక్యాంధ్ర...

తిరుమలేశుడి వేషంలోని సమైక్యాంధ్ర ఉద్యమకారుడు చేతిలో జై సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నాడు. ఇది అందరినీ ఆకట్టుకుంది.

ప్రజాకోర్టు ఇలా...

ప్రజాకోర్టు ఇలా...

రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆందోళనకారులు తిరుపతిలో ప్రజాకోర్టు నిర్వహించారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ కూడా ఇందులో పాల్గొన్నారు.

టీటిడి ఉద్యోగుల ర్యాలీ

టీటిడి ఉద్యోగుల ర్యాలీ

తిరుపతి వీధుల్లో టీటిడి ఉద్యోగులు శుక్రవారం సమైక్యాంధ్రకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. తిరుపతి వీధులు ఈ ర్యాలీతో కదును తొక్కాయి.

పాఠశాలల పిల్లలు

పాఠశాలల పిల్లలు

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాఠశాలల పిల్లలు ర్యాలీ నిర్వహించారు. స్కూల్ డ్రెస్‌లో వారు ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

బారులు తీరిన టిటిడి ఉద్యోగులు

బారులు తీరిన టిటిడి ఉద్యోగులు

టిటిడి ఉద్యోగులు శుక్రవారం సమైక్యాంధ్ర నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు తిరుపతి వీధుల్లో కదం తొక్కారు.

డాలర్ శేషాద్రి నినాదాలు

డాలర్ శేషాద్రి నినాదాలు

సాధారణంగా బయటకు రాని డాలర్ శేషాద్రి శుక్రవారం సమైక్యాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి ఆయన సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

కనబడుట లేదు

కనబడుట లేదు

తమ పార్లమెంటు సభ్యుడు చిత్తరంజన్ దాస్ కనిపించడం లేదంటూ సమైక్యాంధ్ర ఆందోళనకారులు పోస్టర్‌ను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

అల్లూరి సీతారామారాజు

అల్లూరి సీతారామారాజు

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో ప్రజాకోర్టు నిర్వహంచారు. ఇందులో అల్లూరి సీతామారామరాజు వేషధారి కూడా పాల్గొన్నాడు.

సద్భావనా ర్యాలీ..

సద్భావనా ర్యాలీ..

టిటిడి ఉద్యోగులు శుక్రవారం సమైక్యాంధ్రకు అనుకూలంగా సద్భావనా ర్యాలీ నిర్వహించారు. ఇందులో టిటిడి ఉద్యోగులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.

దేవుళ్లూ దిగివచ్చారు..

దేవుళ్లూ దిగివచ్చారు..

టిటిడి సద్భావనా ర్యాలీలో ఉద్యోగులు తమ కళాప్రదర్శనకు పదును పెట్టారు. దేవతల వేషాల్లో తమ సమైక్య గళాన్ని వినిపించారు.

డప్పు కొట్టిన డాలర్ శేషాద్రి

డప్పు కొట్టిన డాలర్ శేషాద్రి

డాలర్ శేషాద్రి అనూహ్యంగా సమైక్యాంధ్ర ర్యాలీలో పాల్గొన్ని డప్పు కొట్టారు. సాధారణంగా విఐపిల వెంట ఉండే ఆయన ఇలా వీధుల్లోకి రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

వంటావార్పూ ఇలా..

వంటావార్పూ ఇలా..

సమైక్యాంధ్ర ఆందోళనకారులు శుక్రవారం తిరుపతిలో వంటావార్పూ నిర్వహించారు. టిటిడి సద్భావనా ర్యాలీలో ఇది కూడా చోటు చేసుకుంది.

డాలర్ శేషాద్రి నృత్యం

డాలర్ శేషాద్రి నృత్యం

డాలర్ శేషాద్రి సమైక్యాంధ్రకు అనుకూలంగా నృత్యం చేశారు. ఆయన సమైక్యాంధ్ర ర్యాలీలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

English summary
Tirumala Tirupati Devasthanam (TTD) staff took out a rally at Tirupati opposing bifurcation decision of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X