ముంబై రేప్: పోర్న్ చూడాలని బాధితురాలిపై ఒత్తిడి
ముంబై: తనను పోర్న్ వీడియో చూడాలని గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితుల్లో ఒకతను ఒత్తిడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఆగస్టు 22న సాయంత్రం శక్తి మిల్స్ పరిసర ప్రాంతంలో 23ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్టుపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పపడిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఐదుగురు నిందుతుల్లో ఒకతను మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియో చూడాలని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఐదుగురు నిందితులు బలవంతంగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 377, సెక్షన్ 120బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు ఐదుగురు నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్ సేకరించి వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అభ్యంతరకర డేటాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. బాధితురాలిపై పోర్న్ చూడాలని ఒత్తిడి చేసిన నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంగ్లీష్ మేగజైన్ లో పనిచేస్తున్న బాధితురాలు అసైన్మెంట్లో భాగంగా తన సహచర ఉద్యోగితో ఘటనా స్థలానికి వెళ్లారు. ఆమెతో వచ్చిన ఉద్యోగిపై దాడి చేసి బంధించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు.












Click it and Unblock the Notifications