భర్తను కట్టేసి, అఫ్గాన్‌లో భారత రచయిత్రి కాల్చివేత

49 ఏళ్ల సుష్మితా బెనర్జీ అఫ్గనిస్తాన్ వాణిజ్యవేత్త జాన్‌బాజ్ ఖాన్‌ను వివాహమాడారు. ఆయనతో కలిసి ఉండడానికి ఆమె ఇటీవలే అఫ్గనిస్తాన్ వచ్చారు. ఖరానా ప్రోవిన్షియల్ రాజధానిలోని ఆమె ఇంటికి తాలిబాన్ మిలిటెంట్లు వచ్చి, భర్తను, ఇతర కుటుంబ సభ్యులను కట్టిపడేశారు. ఆ తర్వాత ఆమెను ఇంటి వెలుపలికి తీసుకుని వెళ్లి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారని బిబిసి వార్తాకథనం.
బెనర్జీ మృతదేహాన్ని మతపరమైన పాఠశాల వద్ద పడేసి వెళ్లిపోయారు. బెనర్జీకి సయీద్ కమల అనే పేరు కూడా ఉంది. ఆమె పత్రికలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తన పనిలో భాగంగా స్థానిక మహిళల జీవితాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.
ఆమెను చంపిన గ్రూప్ ఏది అనేది తెలియడం లేదు. బెనర్జీ రాసిన పుస్తకం ఏ కాబూలీవాలా బెంగాలీ వైఫ్ పుస్తకం భారతదేశంలో బెస్ట్ సెల్లర్‌గా అవతరించింది. తాలిబాన్ల నుంచి 1995లో తాను ఎలా పారిపోయానో వివరిస్తూ ఆమె ఆ పుస్తకం రాశారు. దాన్ని ఆధారం చేసుకుని 2003లో ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ అనే సినిమా రూపొందింది.
తన భర్తతో తన జీవితం గురించి, తాలిబాన్ల నుంచి తప్పించుకోవడం గురించి అందులో ఆమె రాశారు. ఆ సినిమాలో మనిషా కోయిరాల నటించింది.












Click it and Unblock the Notifications