హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొన్నాల, సబితలకు ఊరట: జగన్‌కేసులో నిందితులు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy - Ponnala Laxmaiah
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఇండియా సిమెంట్స్ అంశంలో, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలకు పెన్నా సిమెంట్స్ అంశాలలో క్లీన్ చిట్ లభించింది. సిబిఐ మంగళవారం జగన్ ఆస్తుల కేసులో మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. భారతి, ఇండియా, పెన్నా సిమెంట్స్ అంశంలో సిబిఐ ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.

ఇండియా సిమెంట్ అంశంలో సిబిఐ గతంలో పొన్నాల లక్ష్మయ్యను ప్రశ్నించింది. దీంతో ఆయన పేరు నిందితుల జాబితాలో ఉంటుందని భావించారు. ఆయన పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చడంతో ఊరట లభించింది. గతంలో సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల పేర్లను ఛార్జీషీటులో పేర్కొనడంతో వారు రాజీనామా చేయాల్సి వచ్చింది. పెన్నా సిమెంట్ అంశంలో సబితకు తాజాగా క్లీన్ చిట్ లభించింది. ఈ అంశంలో ఆమెను అధికారులు విచారించారు.

ఇండియా సిమెంట్స్ పెట్టుబడులపై బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను సిబిఐ అధికారులు రెండు రోజులు విచారించారు. ఈ రోజు సిబిఐ మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేసిందని, త్వరలో రెండు మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేయనుందని ఓ న్యాయవాది తెలిపారు.

ఛార్జీషీట్లలో నిందితులు

భారతి సిమెంట్స్ ఛార్జీషీట్

ఎ1 జగన్, ఎ2 విజయ సాయి రెడ్డి, ఎ3 రఘురాం సిమెంట్స్, ఎ4 జె జగన్మోహన్ రెడ్డి, ఎ5 రాజగోపాల్, ఎ6 ప్రభుదాస్, ఎ7 కృపానంద్, ఎ8 శంకర నారాయణ

ఇండియా సిమెంట్స్ ఛార్జీషీట్

ఎ1 జగన్, ఎ2 విజయ సాయి రెడ్డి, ఎ3 శ్రీనివాసన్, ఎ4 శామ్యూల్, ఎ5 ఆదిత్యనాథ్ దాస్, ఎ6 రఘురాం సిమెంట్స్, ఎ7 ఇండియా సిమెంట్స్, ఎ8 జగతి పబ్లికేషన్, ఎ9 కార్మెల్ ఏషియా

పెన్నా సిమెంట్స్ ఛార్జీషీట్

ఎ1 జగన్, ఎ2 విజయ సాయి రెడ్డి, ఎ3 ప్రతాప్ రెడ్డి, ఎ4 పిఆర్ ఎనర్జీ, ఎ5 జె జగన్మోహన్ రెడ్డి, ఎ6 కార్మెల్ ఏషియా, ఎ7 పెన్నా సిమెంట్స్, ఎ8 పయనీర్ హోర్డింగ్స్

English summary
The CBI gave a clean chit to Minister Ponnala Laxmaiah and former minister Sabitha Indra Reddy as their names were not mentioned in the present chargesheet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X