వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ఏడేళ్ల కుమారుడికి జీవితాంతం రక్తం మార్పిడి లేకుండా చేసే ఆపరేషన్ కోసం సాయం చేయండి

సందీప్ ఒక పేద కుటుంబానికి చెందిన ఒక రైతు, తన కుమారుడు సుపేష్ చికిత్సకి డబ్బు కోసం చాలా కష్టపడుతున్నాడు. మీరు కూడా అతనికి చిన్న చిన్న విరాళాలతో సాయపడవచ్చు.

By Staff
|
Google Oneindia TeluguNews

"నిజంగానా నాన్నా? డాక్టర్ అంకుల్ నాకు నయం చేసేసాక ఇక ప్రతి నెలా నేను ఆస్పత్రికి రానవసరం లేదా?" నా ఏడేళ్ళ వయసున్న కుమారుడు సుపేష్ తరచూ అడుగుతుంటాడు. తను తన అన్నదమ్ములకంటే ఎందుకు వేరు అని నన్ను అడుగుతుంటాడు. "నాన్నా, రోహన్, రాధిక ఇంకా రచన నాలాగా ఆస్పత్రికి ఎందుకు వెళ్ళనవసరం లేదు?" ప్రతిసారీ తనొక్కడే హాస్పిటల్ కి వెళ్ళాల్సి రావటంతో ఎంత నిరాశపడుతున్నాడో చూసి, కొంచెం బాధపడకుండా ఉండాలని, నేను డాక్టర్లు సూచించిన పరిష్కారం గురించి వాడికి చెప్పాను. ఎముకలోని మజ్జ ట్రాన్స్ ప్లాంట్. అతను ఆ విషయం విన్నప్పటి నుంచి రోజూ రాత్రి పడుకునేముందు నన్ను అడిగేవాడు.. నాన్న ఆపరేషన్ రేపు జరగబోతోందా అని. కానీ నా కుమారుడికి ఏం చెప్పాలో నాకు అర్థం అయ్యేది కాదు. నా పేదరికం గురించి చెబితే అర్థం చేసుకోటానికి వాడు ఇంకా చిన్నపిల్లవాడు. మాకున్నదంతా అమ్మినా, నేను వాడికి చికిత్స చేయించలేననే విషయం నా కుమారుడికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆపరేషన్ కు మొత్తం 22లక్షలకు ఖర్చు అవుతుంది. నా కుమారుడిని థలసీమియా నుంచి రక్షించాలంటే చాలా ఖరీదైనా చికిత్స అందించాలి.

విరాళం

"మనం శక్తి కోసం ఎప్పుడు వెళ్తున్నాం?" ప్రతినెలా రక్తమార్పిడిని నా బాబు ఇలానే అనేవాడు. సుపేష్ జీవితం ఒక ఆటలాగానే ఉన్నది. ప్రతి నెలా చివర్లో, అతని శక్తి హఠాత్తుగా తగ్గిపోయి, వాడు చాలా బలహీనంగా, అలసటగా మారేవాడు. బాధాకరమైన రక్తమార్పిడి ప్రక్రియ తర్వాతనే వాడిలో మళ్ళీ జీవం వచ్చేది. ఈ రక్తమార్పిడి ప్రక్రియలు వాడికి పవర్ డోసుల్లాగా పనిచేస్తున్నాయి. అతనికి ఈ వ్యాధి నుంచి విముక్తి పొందటానికి, తన వయస్సు ఇతర పిల్లల్లాగా జీవించటానికి తనకి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరి. అతనికి రక్తమార్పిడి లేకుండా జీవితం అన్నదే ఇప్పటివరకు తెలియదు. నేను అలాంటి జీవితం తనకి ఇవ్వాలనుకుంటున్నాను.

విరాళాల రూపంలో మీరు చేసే సాయంతో, సుపేష్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోగలగుతాడు.

విరాళం

నా పేరు సందీప్ సుర్ల్కర్. నేను అకోలాలో నా భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తాను. నేను ఒక చిన్నపాటి రైతు కూలీని. నాకు నెలకి 8,000 రూపాయలు వస్తాయి. సుపేష్ కి ఇప్పటివరకూ 80సార్లు రక్తమార్పిడి జరిగింది. దానికి నాకు ఇప్పటివరకూ ఒక లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చయింది. ఈ డబ్బును కూడగట్టడానికి అనేకమంది తలుపులు కొట్టాల్సి వచ్చింది. అదొక భయానకమైన పరిస్థితి. నేను ఒక్కసారైనా రక్తమార్పిడికి డబ్బు కట్టలేకపోతే, నా సుపేష్ ఇక బతకలేడు. నాకు చాలా భయం వేస్తోంది. ఒక్కసారి రక్తమార్పిడి మిస్సయితే ఏం జరుగుతుంది? రక్తమార్పిడి జరగకుండా సుపేష్ కనీసం నడవలేడు కూడా. ప్రతినెలా చివరికి, వాడు తన సమయం మొత్తం పడుకునే ఉంటాడు. ఈ ప్రాణాలను కాపాడే రక్తమార్పిడి సెషన్స్ లేకపోతే నా బిడ్డ జీవితం స్తంభించిపోతుంది.

థలసీమియా నా బాబు వెనక అతను కేవలం నాలుగు నెలల వయస్సు నుంచే వెంటపడటం ప్రారంభించింది. 2010లో వాడికి 3 నెలల వయస్సున్నప్పుడు, తల్లిపాలను మానేసాడు. మేము భయపడి, వైద్యున్ని సంప్రదించాం. ఒక నెల పాటు, అనేక టెస్టుల తర్వాత, థలసీమియా అని తెలిసింది. అతను ఈ వ్యాధితో 7ఏళ్ళ సుదీర్ఘకాలం నుంచి పోరాడుతున్నాడు.

విరాళం

సందీప్ ఒక పేద కుటుంబానికి చెందిన ఒక రైతు, తన కుమారుడి చికిత్సకి డబ్బు కోసం చాలా కష్టపడుతున్నాడు. మీరు కూడా అతనికి చిన్న చిన్న విరాళాలతో సాయపడవచ్చు.

వైద్యులు సుపేష్ కి జీవితకాలమంతా ప్రతి నెలా రక్తమార్పిడి అవసరం అని చెప్పారు. ప్రతిసారి నాకు 1500 రూపాయలు దానికి ఖర్చవుతుంది. సుపేష్ బాధాకర సమస్యకి శాశ్వత పరిష్కారం ఎముక మజ్జ ట్రాన్స్ ప్లాంట్ మాత్రమే. నాకు ఈ పరిష్కారం మొదటినుంచే తెలుసు కానీ మ్యాచ్ అయ్యే దాత మాకు దొరకలేదు. కానీ ఇప్పుడు మాకు దొరికింది- మా చిన్న కూతురు, 3.5 ఏళ్ళ వయస్సున్న రచన బోన్ మారో సుపేష్ తో సరిపోయింది. సుపేష్ కి తన చెల్లెలే తన ప్రాణం కాపాడబోతోందని చెప్పినప్పుడు, వాడి జవాబు ఏంటంటే, "వచ్చే రక్షాబంధన్ లో, ఇక నుంచి నేను తనకి రాఖీ కడతాను, నా ప్రాణం కాపాడుతోంది కదా." అని అన్నాడు.

విరాళం

బోన్ మారో దాతను మా ఇంట్లోనే పొందటం ఈ అంధకారంలో మాకొచ్చిన చిన్న అదృష్టం, ఆశ.నాకు నా బాబును ఆస్పత్రికి తిరుగుళ్ళు, నొప్పెట్టే ఇంజక్షన్ల నుంచి దూరం చేయాలని ఉంది, కానీ ఓడిపోతున్నాను. దయచేసి నాకు సాయం చేయండి.
మీరు సందీప్ కి కెట్టోలోని తన ఫండ్ రైజర్లో విరాళం అందించవచ్చు ఇక్కడ.

English summary
His 7-Year-Old Son Needs A Surgery To Escape Lifelong Painful Blood Transfusions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X