లోకసభ ఎన్నికలు 2019: అదిలాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

తెలంగాణ రాష్ట్రంలోని17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అదిలాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కి రిజర్వ్ చేయబడినది. 2014 లోకసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నగేష్ గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
1952లో తొలిసారి మాత్రం సోషలిస్ట్ పార్టీ తరఫున మాధవ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఆరుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) గెలిచింది. రెండో లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అశన్న, ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ నుంచి నారాయణ రెడ్డి, పొద్దుటూరి గంగారెడ్డి (వరుసగా రెండుసార్లు), నర్సింహా రెడ్డి (వరుసగా రెండుసార్లు), ఆ తర్వాత 1984లో టీడీపీ నుంచి సీ మాధవ రెడ్డి గెలిచారు. 1989 కాంగ్రెస్ (ఐ) నుంచి నర్సారెడ్డి గెలిచారు.
అటు తర్వాత వరుసగా నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1991లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, 1996, 1998, 1999లలో వరుసగా మూడుసార్లు సముద్రాల వేణుగోపాల చారి విజయం సాధించారు. 2004లో తెరాస నుంచి మధుసూదన్ రెడ్డి గెలవగా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో (2008) కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. 2009లో టీడీపీ నుంచి రమేష్ రాథోడ్, 2014లో తెరాస నుంచి నగేష్ గెలిచారు.

అదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 13,86,233 ఓటర్లు ఉండగా, అందులో 6,87,389 పురుష ఓటర్లు, 6,98,844 మహిళా ఓటర్లు ఉన్నారు. 2014లో 10,45,839 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 5,19,364, మహిళా ఓటర్లు 5,26,475. గత ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమోదయింది.
ఈ నియోజకవర్గం పరిధిలో 19,91,992 జనాభా ఉంది. గ్రామీణ జనాభా 79.60% కాగా, పట్టణ జనాభా 20.40%గా ఉంది. ఎస్సీ జనాభా 15.27% శాతం కాగా, ఎస్టీ జనాభా శాతం 22.48%గా ఉంది.
గత ఎన్నికల్లో గణేష్ 1,71,290 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గణేష్‌కు 4,30,847 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేష్ జాదవ్‌కు 2,59,557 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన రమేష్ రాథోడ్‌కు 1,84,198 ఓట్లు వచ్చాయి. అంతకుముందు 2009లో రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి 1,15,087 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ పైన విజయం సాధించారు.
2014లో గెలిచిన నగేష్ లోకసభలో 12 ప్రశ్నలు అడిగారు. ఇది తెలంగాణ యావరేజ్ 285గా ఉండగా, నేషనల్ యావరేజ్ 273గా ఉంది. ఆయన 4 చర్చల్లో పాల్గొన్నారు. ఇది తెలంగాణ యావరేజ్ 36.7 శాతంగా ఉండగా, నేషనల్ యావరేజ్ 63.8 శాతంగా ఉంది. ప్రయివేటు మెంబర్ బిల్స్ ఏమీ పెట్టలేదు. హాజరు శాతం 83గా ఉంది. ఇది తెలంగాణ యావరేజ్ 69 శాతంగా ఉంది. ఎంపీలాడ్స్ నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనులకు 18.6 కోట్లు ఖర్చు చేశారు.
అదిలాబాద్ లోక్‌సభ నియోజవర్గం.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉంది. ఈ జిల్లా తెలంగాణలో రెండో అతిపెద్ద జిల్లా (ఉమ్మడి). వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రత్యేకంగా ఇస్తుంది. ఈ వెనుకబడిన జిల్లాల జాబితాలో అదిలాబాద్ ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications