మాములు బావ కాదు.. ఇద్దరు మరదళ్లతో ప్రేమాయణం, పెళ్లి కూడా..

ఈ కాలంలో ఒకరితో వేగడమే కష్టం.. ఇద్దరితో ప్రేమ.. పెళ్లి అంటే కష్టమే. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వామ్మో అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వస్తున్నాయి. అయితే ఓ యువకుడు ఇద్దరినీ ప్రేమించాడు. వారు అతనికి వరసకు మరదళ్లే.. ఇంకేముంది ఇద్దరికీ వ్యవహారం తెలిసింది. ఆ యువతులు కూడా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఓకే మండపంలో.. ఇద్దరినీ తన జీవితంలో ఆహ్వానించాడు. చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మరదళ్లతో ప్రేమాయణం..

మరదళ్లతో ప్రేమాయణం..


ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడో బావ. మేనత్తల కూతుళ్లు కావడంతో ఆ ఇద్దరూ ఆ బావను కూడా ఇష్టపడ్డారు. దీంతో ఏ సమస్య లేకుండా పోయింది. పెళ్లి కూడా ఇద్దరినీ చేసుకోవాలని ఉందని యువకుడు ప్రపోజల్ పెట్టాడు. ఆ ఇద్దరూ కూడా అందుకు సరేననడంతో పెద్దల అంగీకారంతో ఊరందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా ఒకే మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టి ముగ్గురు ఒక్కటయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు మండలం ఘనపూర్‌లో ఈ ఘటన జరిగింది.

మూడేళ్లుగా వ్యవహారం

మూడేళ్లుగా వ్యవహారం

ఘనపూర్​కు చెందిన అర్జున్ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. అతనికి ఇద్దరు మేనత్తలు ఉన్నారు. సురేఖ, కనక ఉషారాణి అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఉషారాణిది ఘన్ పూర్ కాగా, సురేఖది శంభూగూడ గ్రామం. ఆ ఇద్దరినీ అర్జున్ ఏకకాలంలో ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు ఏళ్ల నుంచి ప్రేమించాడు. నెల రోజుల క్రితం ఇద్దరినీ ప్రేమిస్తున్న సంగతి మరదళ్లకు చెప్పగా వాళ్ళు కూడా పెళ్ళికి ఒకే చెప్పారు.

గిరిజన సంప్రదాయం ప్రకారం

గిరిజన సంప్రదాయం ప్రకారం

మూడు కుటుంబాల సభ్యులతో మాట్లాడిన ఆ ముగ్గురు.. గ్రామ పెద్దలతో మాట్లాడి వారిని పెళ్ళికి ఒప్పించారు. దీంతో పెద్దల సమక్ష్యంలో ఈ నెల 14వ తేదిన ముహుర్తం కుదుర్చుకొని ఘన్ పూర్‌లో ఆ యువకుడు ఒకే పెళ్లి పందిరిలో వివాహం చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టి ఒక్కటయ్యారు. ఈ పెళ్లి జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+