ఆర్టీసీ బస్సులో గర్బిణీ డెలివరీ.. పురిటి నొప్పులు రావడంతో మగబిడ్డ జననం.. ఇద్దరు సేఫ్
ప్రగతి రథ చక్రాలు.. అదే ఆర్టీసీ బస్సు, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులను కూడా తీసుకొచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానానికి తరలించడమే తమ లక్ష్యం అని ఆర్టీసీ చెబుతుంది. కొన్ని సార్లు.. కొన్ని ఘటనలు జరిగినా.. చివరికీ జనాలకు ఆర్టీసీపై మంచి ఇంప్రెషన్ ఉంది. టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక సంస్కరణలు చేపట్టారు. కానీ ఛార్జీలు మాత్రం పెంచుతూనే ఉన్నారు.

గర్బిణీ ప్రసవం..
మారుమూల ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సేవలను అందిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవించింది. ఇంద్రవెల్లి మండలం మాన్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రసవం జరిగింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన తర్వాత తల్లీబిడ్డను గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

తల్లీబిడ్డ క్షేమం..
బాలింత, పసి బిడ్డ ఆరోగ్యం గురించి ఆర్టీసీ అధికారులు తెలుసుకున్నారు. గర్భిణి ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వెళుతుంది. నెలలు నిండటంతో బస్సులో పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. కానీ ఆమె బస్సులోనే ప్రసవించింది. బాలింత మహారాష్ట్రకు చెందిన రత్నమాల అని అధికారులు తెలియజేశారు. ఆమెను కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి వచ్చి.. తల్లీ, బిడ్డను చూసుకున్నారు.

చార్జీల వాత
ఇటీవల వరసగా బస్సు చార్జీలు పెంచుతున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సజ్జనార్ సార్.. ఏంటీ ఇదీ అని అడుగుతున్నారు. కనీస చార్జీ కూడా ఎక్కువే ఉంటుంది. అంతే కాదు బస్సు పాసుల చార్జీ కూడా ఎక్కువే ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మిగతా పనులు బాగున్నా.. చార్జీల వాత మాత్రం ఉంటుంది. దీంతో సామాన్యుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బస్సుల్లో మధ్య తరగతి వారు, స్కూల్ పిల్లలే ప్రయాణిస్తారు. మరీ వారిపై భారం వేయడం సరికాదు.. అయినప్పటికీ ఆర్టీసీ నష్టాలు మాత్రం తగ్గడం లేదు. ఆక్యుపెన్సీ ఏ మాత్రం ఇంప్రూవ్ కావడం లేదు. ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications