తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంచిర్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచిర్యాల ఒకటి. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఇది పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మంచిర్యాల గతంలో అదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇప్పుడు మంచిర్యాల జిల్లాగా ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నడిపెల్లి దివాకర్ రావు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసిన దివాకర్ రావుకు 95,171 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డమ్ అరవింద్ రెడ్డికి 35,921 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో, అలాగే 2010 ఉప ఎన్నికల్లో ఇదే టీఆర్ఎస్ తరఫున గడ్డమ్ అరవింద్ రెడ్డి విజయం సాధించారు. కానీ 2014లో అరవింద్ రెడ్డిపై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దివాకర్ రావు 59,250 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

మరిన్ని ఆదిలాబాద్ వార్తలుView All
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!