• search
  • Live TV
ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అఖిల అడుగులు జ‌న‌సేన వైపేనా..! : సీయం టూర్ కు దూరం : అనుస‌రించేదెవ‌రు..!

|

మంత్రి అఖిల ప్రియ రాజ‌కీయ అడుగుల్లో మార్పు క‌నిపిస్తోంది. మంత్రి గా ఉన్నా..నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా త‌న కు త‌గిన ప్రాధాన్య‌త లేకుండా చేస్తున్నార‌నే అవేద‌న‌లో అఖిల ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో.. రాజ‌కీయం గా అఖిల కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మంత్రిగా పాల్గొ న‌క పోవ‌టం ఈ అనుమానాలకు మ‌రింత బ‌లం ఇస్తోంది...ఇంత‌కీ అఖిల రాజ‌కీయ అడుగులు ఎటు..

టిడిపి పై అసంతృప్తిలో మంత్రి అఖిల‌..

టిడిపి పై అసంతృప్తిలో మంత్రి అఖిల‌..

త‌ల్లి మ‌ర‌ణం తో ఉప ఎన్నిక‌ల ద్వారా అఖ‌ల ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి స‌హ‌కారంతో రాజ‌కీయాల్లో ప‌ట్టు సా ధించే ప్ర‌య‌త్నం చేసారు. ఇంత‌లో తండ్రితో క‌లిసి వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించారు. ఆ త‌రువాత తండ్రి ఆక స్మికంగా మ‌ర‌ణించారు. కొద్ది కాలానికి అఖిల మంత్రి అయ్యారు. అయితే, అఖిల వ్య‌వ‌హార శైలి పై భూమా కుటుంబాని కి స‌న్నిహితులు గా వ్య‌వ‌హ‌రించన సుబ్బారెడ్డి లాంటి వారే ఫిర్యాదు చేసారు.

అఖిల కు వ్య‌తిరేకంగా ముఖ్య‌మంత్రి వ‌ద్ద పంచాయితీలు జ‌రిగాయి. సుబ్బారెడ్డికి నామినేటెడ్ పోస్టు ద్వారా ప్రాధాన్య‌త ఇచ్చి న‌చ్చ చెప్పారు. ఇక‌, మంత్రి గా ఉన్న అఖిల అంద‌రినీ క‌లుపుకుపోవ‌టం లో స‌క్సెస్ కాలేక పోయార‌నే భావ‌న ఉంది. దీంతో..జిల్లాలోని టిడిపి నేత లే అఖిల కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నారు. దీంతో..అఖిల సైతం పార్టీ నేత‌ల తీరు పై అస‌హ‌నం త ఉన్నారు . త‌న‌కు త‌న‌ను న‌మ్ముకున్న వారే ముఖ్య‌మ‌ని అఖిల చెబుతున్నారు.

పార్టీ మార్పు పై జోరుగా ప్ర‌చారం..సీయం టూర్ కు దూరం..

పార్టీ మార్పు పై జోరుగా ప్ర‌చారం..సీయం టూర్ కు దూరం..

ఇక‌, మంత్రి అఖిల పార్టీ మారుతారంటూ ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం తో పాటుగా క‌ర్నులు జిల్లాలో జోరుగా ప్రచారం జ‌రు గుతోంది. టిడిపి లో త‌నకు వ్య‌తిరేకంగా నేత‌లు ప‌ని చేస్తున్నా..అధి నాయ‌క‌త్వం వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం పై మంత్రి అఖిల అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుండి టిడిపి బ‌రిలోకి దింపుతోంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. నంద్యాల నుండి మైనార్టీ అభ్యర్దికి అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. క‌ర్నూలు ఎమ్మెల్యేగా అఖిల మేన‌మామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

దీంతో, భూమా కుటుంబం నుండి బ్ర‌హ్మానంద‌రెడ్డికి మాత్ర‌మే టిక్కెట్ ద‌క్కుతుందంటూ అఖిల వ్య‌తిరేకులు ప్ర‌చారం చేస్తున్నారు. దీని పై అఖిల వర్గం మాత్రం రియాక్టం అవ్వ‌టం లేదు. ఇక‌, ట‌డిపిలో జ‌రుగుతున్న ప‌రిణామాల పై అగ్ర‌హంతో ఉన్న అఖిల ..జిల్లా ప‌ర్య‌ట‌నకు సీయం వ‌చ్చినా..ఆయ‌న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే అఖిత సీయం ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నార‌ని..అయితే, సీయం కు స‌మాచారం ఇచ్చార‌ని చెబుతున్నారు.

జ‌న‌సేన వైపు చూపు..! నాటి సంబంధాలే బ‌లం...

జ‌న‌సేన వైపు చూపు..! నాటి సంబంధాలే బ‌లం...

ఇక‌, మంత్రిగా ఉన్న అఖిల ప్రియ టిడిపిలో ఉండ‌ర‌ని వ్య‌తిరేకులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. అఖిల త్వ‌ర లోనే టిడిపి వీడుతార‌ని..ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. టిడిపిని వీడితే..వైసిపి లో చేరే అవ‌కాశం అఖిల కు లేదు. దీంతో..త‌న త‌ల్లి తండ్రులు 2004 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన విష‌యాన్ని అఖిల ఇప్పుడు ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. శోభా నాగిరెడ్డి 2004 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ త‌రువాత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా వైసిపి లో చేరారు. ఇక‌, భూమా దంప‌తుల మ‌ర‌ణం త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాన్..వారి పిల్ల‌ల గురించి ప‌లు మార్లు ఆరా తీసేవారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ప‌వ‌న్ త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తార‌ని అఖిల ఆశాభావం వ్య‌క్తం చేసారు. ఒక‌, ఇప్పుడు మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప థ్యం లో అఖ‌ల జ‌న‌సేన నుండి ఈ సారి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది .దీని పై ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారికంగా భూమా కుటుంబం నుండి స్పంద‌న లేదు. ఇదే నిజ‌మైతే..మరి అఖిల తో పాటుగా ఎవ‌రు పార్టీని వీడు తార‌నే చ‌ర్చ మాత్రం సాగుతోంది.

English summary
Minister Akhila Priya may jained in Janasena before general elections. But, officially Akhila not conformed this news. Akhila parents contested from PRP in 2009 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X