ఏపీలో 1085 కరోనా కేసులు: 8 మంది మృతి
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 57,745 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,085 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2002340కు చేరింది. మరో 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13723కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14677 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 1,541 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 1973940కి చేరింది. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 2,60,91,962 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూల్ జిల్లాలో ఒక్కరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు , విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications