ఏపీ కరోనా అప్‌డేట్స్: 2100 కేసులు.. 26 మంది మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ చల్లబడింది. ఏపీలో వైరస్‌కు చెక్ పెట్టడానికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. గత 24 గంటల్లో 72,731 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 పాజిటివ్ కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 583 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 316 కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 22 కేసులను గుర్తించారు. శ్రీకాకుళంలో 48, కర్నూలులో 50, అనంతపురంలో 60, విశాఖ జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయి.
3,435 మందికి కరోనా తగ్గింది. వైరస్ సోకిన 26 మంది మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,05,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,58,189 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 33,964 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,870కి పెరిగింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.












Click it and Unblock the Notifications