Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కరోనా తగ్గుదల.. 244 కేసులు నమోదు.. ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తగ్గింది. దాదాపుగా అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యింది. ఇదీ సానుకూల అంశం. ఏపీలో గత 24 గంట్లలో 244 కరోనా కేసులు వచ్చాయి. కరోనా సోకిన ఇద్దరు చనిపోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలను కోల్పోయారు. గత 24 గంటల్లో 662 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 18వేల 803 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో 3,30,10,692 కోవిడ్ పరీక్షలు చేశారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,711గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,96,430గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14 వేల 716కి చేరింది. ప్రస్తుతం 5 వేల 565 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు 20 వేల దిగువనే కేసులు వచ్చాయి. తాజాగా 13 వేలకు తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి క్షీణించింది. మృతుల సంఖ్య కూడా అదుపులోనే ఉంది. 10,84,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13 వేల 405 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 16 శాతం మేర తగ్గాయి. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో మరో 235 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,12,344కి పెరిగింది.

244 people infected coronavirus in andhra pradesh

కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 2 లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం ఆ కేసులు 1,81,075గా ఉన్నాయి. నిన్న 34,226 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.21 కోట్లకు పైగానే ఉంది. నిన్న 35,50,868 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+