ఏపీలో 4 వేల కేసులు.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 30,886 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,198 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కొత్త కేసులు గాగా, కృష్ణా జిల్లాలో 528, గుంటూరు జిల్లాలో 485, కర్నూలు జిల్లాలో 459, పశ్చిమ గోదావరి జిల్లాలో 446 కేసులు గుర్తించారు. 9,317 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,97,369 మంది కరోనా బారినపడగా, వారిలో 21,94,359 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 88,364 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,646కి పెరిగింది.
దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.'

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications