వావ్.. ఏపీలో గణనీయంగా తగ్గిన కేసులు..వందలోపే నమోదు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వేల నుంచి వందలకు వచ్చేశాయి. వందల వరకు కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి మరింత తగ్గుతోంది. గత 24 గంటల్లో 12,916 శాంపిల్స్ పరీక్షించగా, 76 మందికి పాజిటివ్ వచ్చింది.
అనంతపురం జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కొత్త కేసులు వచ్చాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 266 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,338 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,458 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. 1,151 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 14,729 మంది కరోనాతో మృతి చెందారు.

ఇటు నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని కాన్పూర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని వివరించారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో కచ్చితమైన అంచనా వేసింది. సో ఫోర్త్ వేవ్ కూడా అలానే భావించాలి. సరయిన జాగ్రత్తలు తీసుకొని.. థర్డ్ వేవ్ మాదిరిగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications