ఏపీలో తగ్గిన కరోనా.. 94 కేసులు నమోదు.. ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,710కి చేరింది. వైరస్ సోకిన ఒకరు చనిపోగా.. కరోనాతో చనిపోయిన మొత్తం మంది సంఖ్య 7,139 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 2,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని రాష్ట్రవ్యాప్తంగా 8,76,372 మంది రికవరీ అయ్యారు.

కరోనా తగ్గుముఖం పట్టినా.. క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శానిటైజర్, మాస్కులు విధిగా వాడాలని డాక్టర్లు తెలిపారు. స్ట్రెయిన్ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. అసలే స్ట్రెయిన్ టెన్షన్ కూడా ఉంది. వెలుగుచూసిన బ్రిటన్ కన్నా.. దేశంలో ఎక్కువ కేసులు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ రేపు శనివారం ప్రారంభం కాబోతుంది.

94 corona cases register in andhra pradesh

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 202 కరోనా కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,91,118కి చేరింది. కరోనా వల్ల ఇద్దరు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1574 మంది చనిపోయారు. రాష్ట్రంలో 4,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,85,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+