అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్టీలోకి పలువురు ప్రముఖులు వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, గతంలో అబ్దుల్ కలాం సలహాదారుగా సేవలు అందించిన పొన్ రాజ్‌ను జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు.

కలాం సలహాదారుగా ఉంటూ దేశానికి సేవలు

అబ్దుల్ కలాం సలహాదారుగా ఉంటూ దేశానికి ఎంతో సేవ చేసిన పొన్ రాజ్ జనసేన పార్టీ సలహామండలిలో ఉండడం ఆనందంగా ఉందని జనసేనాని అన్నారు. పొన్ రాజ్ సూచనలు, సలహాలు, అనుభవం బడుగు బలహీనవర్గాల వారిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా పోన్ రాజ్ మాట్లాడుతూ... పవన్ క్రియేటివ్ లీడర్ అని, ఏపీ అభివృద్ధి కోసం ఆయన విజన్ తనకెంతో నచ్చిందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న అభిలాష అబ్దుల్ కలాంలో ఉండేదని, పవన్‌లో కూడా ఆ తపన కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన వనరులు, యువ నైపుణ్యాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.

రక్షణ రంగ శాస్త్రవేత్త

రక్షణ రంగ శాస్త్రవేత్త

తమిళనాడుకు చెందిన వి పొన్ రాజ్ రక్షణరంగ శాస్త్రవేత్త. టెక్నాలజీ ఇంటర్‌ఫేజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అబ్దుల్ కలాం సాంకేతిక సలహాదారుగా ఉన్న సమయంలో ఆయనకు సలహాదారుగా వ్యవహరించారు. అబ్దుల్ కలాంతో పొన్ రాజ్‌కు ఇరవై ఏళ్ల అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం ఏపీకి ఉపయోగపడుతుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు.

రెండు రోజుల క్రితం నెరవేరిన ఎదురుచూపులు

జనసేనలో ప్రముఖులు చేరుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం వీవీ రామారావు పార్టీలో చేరారు. ఆయనను ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్ వింగ్ సెక్రటరీగా నియమించారు. ప్రొఫెసర్ ఎన్ సుధాకర రావును అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా చేశారు. రిటైర్డ్ డీజీపీ రవి కుమార్ కూడా జనసేనలో చేరారు. అంతకుముందు, ప్రముఖ కాలమిస్ట్ పెంటపాటి పుల్లారావు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. పోలవరం నిర్వాసితుల కోసం పుల్లారావు ఎంతో పోరాటం చేశారని, ముఖ్యంగా గిరిజనులకు అండగా నిలబడిన వ్యక్తి అని ప్రశంసించారు. పార్టీలో చేరగానే పుల్లారావును జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా పవన్ నియమించారు. గతంలో ఓ పత్రికలో పెంటపాటి పుల్లారావు జనసేన గురించి కాలమ్ రాశారు. అప్పుడే పవన్.. పుల్లారావును తాను పార్టీలోకి ఆహ్వానించానని, వేచి చూస్తున్నానని చెప్పారు. తద్వారా పవన్ ఎదురుచూపులు నెరవేరాయి.

English summary
Former President A.P.J. Abdul Kalam's advisor Pon Raj will be serving the Jana Sena party as he has just been appointed as a member of the party’s Advisory Council. Jana Sena president K. Pawan Kalyan announced that Mr Pon Raj had given his consent to serve as a member of the Advisory Council of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X