Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీయం ఒక కులానికే దోచి పెడుతున్నారు : ఆ కులం ఏపిని క‌బ‌లించేస్తోంది: ఆమంచి సంచ‌ల‌నం..!

ముఖ్య‌మంత్రి చంద్రబాబు పై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం మొద‌లు..నిఘా అధికారులు..పార్టీ- ప‌రిపాల‌న‌-పోలీస్ శాఖ‌ల్లొ మొత్తం కీల‌క విభాగాల్లో త‌న సామాజిక వ‌ర్గం వారికే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని..ఆ కులం ఏపికి క‌బ‌లించేస్తోంద‌ని ఆమంచి విరుచుకుప‌డ్డారు.

Amanchi Krishna Mohan serious comments on Cm : Babu giving priority to his own caste..

ముఖ్య‌మంత్రి కార్యాల‌యం మొద‌లు..
తాజాగా వైసిపి లో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నం గా మారాయి. ముఖ్య‌మంత్రికి కుల పిచ్చి ఉందో లేదో ఆయ‌న చేస్తున్న నియామ‌కాల ద్వారా స్ప‌ష్టం అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. సీయం కార్యాల‌యంలో న‌లుగురు అధికారులు ఉంటే అందులో ఇద్ద‌రు రాజ‌మౌళి..సాయి ప్ర‌సాద్ లు ముఖ్య‌మంత్రి వ‌ర్గానికే చెందిన వార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్య‌మంత్రి అప్పాయింట్మెంట్ తీసుకోవాలంటే సంప్ర‌దించే ఆయ‌న పీ య‌స్ అదే వ‌ర్గానికి చెందిన వార‌న్నారు. ఏపిలో నిఘా విభాగాధిప‌తి వెంక‌టేశ్వ‌ర‌రావు ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన వార‌ని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిఘా విభాగంలో తీసుకున్న రిటైర్డ్ అధికారి యోగానంద్, కో ఆర్డినేష‌న్ ప‌ద‌వి ఇచ్చి నియ‌మించుకున్న ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ సైతం ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే నంటూ ఆమంచి విశ్లేషించారు. ఇక‌, ముఖ్య‌మంత్రి కి పార్టీ ప‌రంగా స‌మాచారం ఇచ్చి అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టే టిడి జ‌నా ర్ద‌న్ సైతం ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని పేర్కొన్నారు.

20 మంది అధికారులు ఆ వ‌ర్గం వారే..
ఏపిలో ప‌ని చేయ‌లేక ఇక్క‌డి నుండి అనేక మంది అధికారులు వెల్లిపోయార‌ని..దీంతె కేంద్ర స‌ర్వీసుల‌కు చెందిన 20 మంది అధికారులు ఏపికి డిప్యుటేష‌న్ మీద వ‌చ్చార‌ని ఆమంచి వివ‌రించారు. అందులో 15 మంది ముఖ్య‌మంత్రి సా మాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని ఆమంచి దుయ్య‌బ‌ట్టారు. ఆ అధికారుల్లో ఒక రెడ్డి సామాజిక వ‌ర్గం అధికారి ఉంటే ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌లేద‌ని వివ‌రించారు. ఇక‌, ఏపిపిఎస్సీ ఛైర్మ‌న్ ఉద‌య్ భాస్క‌ర్ సైతం ముఖ్య‌మంత్రి బంధువు అని..ఒకే కులానికి ముఖ్య‌మంత్రి దోచి పెడుతున్నార‌ని ఆమంచి ఆరోపించారు. ఆయ‌న‌కు కుల పిచ్చి లేద‌ని చెబుతు న్నా..ఆయ‌న చుట్టూ ఒకే కులం వారు ఉన్నార‌ని విమ‌ర్శించారు. వారు ఏపిని క‌బ‌లించేస్తున్నార‌ని.. పార్టీలో.. పరిపాల న లో ..పోలీసు శాఖ‌లో మొత్తంగా త‌న సామాజిక వ‌ర్గం వారినే నియ‌మించి ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌య త్నం చేస్తున్నార‌ని..ఇటువంటి తాము లెక్క చేయ‌మ‌ని.. భారీ మెజార్టీతో జ‌గ‌న్ ను గెలిపిస్తామ‌ని ఆమంచి కృష్ణ‌మోహ‌న్
స్ప‌ష్టం చేసారు. రేప‌టి నుండి సీయం కుల పిచ్చి గురించి మ‌రిన్ని వివ‌రాలు చెబుతాన‌ని ఆమంచి ప్ర‌క‌టించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+