అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీకి హైకోర్టు నోటీసులు, యార్లగడ్డ పిటిషన్‌ ఆధారంగా, అక్రమాలు అంటూ

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. వంశీ ఎన్నికను రద్దు చేయాలని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పిటిషన్ దాఖలు చేసిన. ఆ పిల్ మేరకు హైకోర్టు ఈ నోటీసులు ఇష్యూ చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయగా... వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగారు. కానీ ఇప్పుడు వంశీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి.. పార్టీలో చేరాలని వైసీపీ హై కమాండ్ షరతు విధించగా.. ఆయన ససేమిరా అన్నారు.

ఆ ఎన్నికలో గెలిచిన వంశీ.. టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు. అతని స్నేహితుడు కొడాలి నాని వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే వంశీ ఎన్నికను రద్దు చేయాలని వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. రెండేళ్ల క్రితం పిటిషన్ వేస్తే ఇప్పటి వరకు ప్రతివాదులకు నోటీసులు జారీ కాలేదని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

andhra pradesh highcourt issue notice to vamsi

2019 ఎన్నికల్లో ప్రసాదంపాడులో వంశీ అనుచరులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అంశాన్ని తన పిటిషన్‌లో ప్రస్తావించారు. వెంకట్రావు వాదనలు విన్న కోర్టు.. వంశీతోపాటు గన్నవరం రిటర్నింగ్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

వంశీ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయలేదు. అలా చేస్తే ఆయన కూడా వైసీపీలో ఉండేవారు. అప్పుడు యార్లగడ్డ వెంకట్రావుకు వైసీపీ టికెట్ విషయంలో పోటీ ఉండేంది. ఇప్పటికే గన్నవరంలో వంశీ వర్సెస్ యార్లగడ్డ మధ్య గొడవ జరుగుతుంటాయి. ఆ క్రమంలోనే యార్లగడ్డ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

English summary
andhra pradesh highcourt issue notice to gannavaram mla vallabanani vamsi mohan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X