అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రానికి బాబు స‌వాల్ : 27న ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంఖుస్థాప‌న‌..

|
Google Oneindia TeluguNews

కేంద్రం- ఏపి ప్ర‌భుత్వం మ‌ధ్య ఉన్న వైరుధ్యం ఇక‌..ప్ర‌త్య‌క్ష యుద్దంగా మారుతోంది. కేంద్రం ఏపికి అమ‌లు చేయాల్సి న హామీలు చేయ‌కున్నా..తామే చేసుకుంటామ‌నే రీతిలో ఏపి ప్ర‌భుత్వం క్షేత్ర స్థాయిలోకి రంగంలోకి దిగుతోంది. ఏపి పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపికి రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ పై కేంద్రం సాగ‌దీస్తోంది. దీంతో..ఏపి ప్ర‌భుత్వ‌మే త‌మ సొంత నిధుల‌తో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయింది.

కేంద్రం ఏపికి అమ‌లు చేయాల్సిన హామీలు అమ‌లు చేయ‌పోయినా..తామే వాటిని పూర్తి చేసుకోవాల‌ని ఏపి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగా.. ఈ నెల 27న క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంఖుస్థాప‌న చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయా ల‌ని నిర్ణ యించారు. ఇందు కోసం 3147 ఎక‌రాల భూమిని కేటాయించారు.

AP Govt decided to start steel factory with own funds : works start on 27th..

శంఖుస్థాప‌న ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటుగా ఏపి ఐఐసి అధికారులు ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి ఈ శంఖుస్థాప‌న చేయనున్నారు. క‌డప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కు సంబంధించి కేంద్రం - రాష్ట్రం మ‌ధ్య అనేక సంప్ర‌దింపులు జ‌రిగాయి.అయితే , క‌డ‌ప లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కు ఫీజబులిటీ లేద‌ని కేంద్రం చెబుతోంది. అయితే, రాజ‌కీయంగానూ క‌డ‌ప జిల్లాలో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు పై దీక్ష‌లు..నిర‌స‌న‌లు జ‌రిగాయి. టిడిపి ఎంపి సీయం ర‌మేష్ సైతం ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసారు. వైసిపి నేత‌లు సైతం నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.

ఒకవైపు తండ్రి మరణం..మరోవైపు ఎన్నికల విధులు.. ఒకవైపు తండ్రి మరణం..మరోవైపు ఎన్నికల విధులు..

ఇదే స‌మ‌యంలో..ముఖ్య‌మంత్రి కేంద్రానిని ఏపి ప్ర‌భుత్వం నుండి ఓ ప్ర‌తిపాద‌న చేసారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ తామే ఏర్పా టు చేస్తామ‌ని..కేంద్రానికి వెళ్లాల్సిన మొత్తంలో రాయితీలు ఇవ్వాల‌ని కోరారు. అయినా..కేంద్రం నుండి స్పంద‌న రాలే దు. దీంతో..తామే ముందుగా ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంఖుస్థాప‌న చేసి..ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ముందుకు వెళ్ల‌టం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వానికి చెక్ పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి యోచిస్తున్నారు.

English summary
AP Government Decided to establish steel factory with state Government funds. Decided to start works from this month 27th in Kadapa district. C.M start works in 3147 acres land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X