సీయం పై అశోక్ గజపతి రాజు అసంతృప్తి : ఎన్నికల్లో పోటీ చేయరా..!.. కారణం అదేనా..!
కేంద్ర మాజీ మంత్రి..టిడిపి సీనియర్ నేత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో దూరంగా ఉంటున్నారు. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి పర్య టనలోనూ ఆయన దూరంగా ఉన్నారు. ఢిల్లీ దీక్ష సమయంలో చంద్రబాబు తో ఉన్న అశోక్ ఇప్పుడు ఇలా వ్యవహరిం చటానికి కారణాలు ఏంటనే చర్చ మొదలైంది..

అశోక్ గజపతి రాజు గైర్హాజరు..
టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వ్యవహారం ఇప్పుడు టిడిపిలో హట్ టాపిక్ అయింది. ఆయన ఎన్నికల సమాయత్తంలో భాగంగా నిర్వహిస్తున్న కీలక పాలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో భోగాపురం విమనాశ్రయ శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఆ కార్యక్రమానికి అశోక్ గజపతి రాజు హాజరు కాలేదు. ఈ నెల 11న ఢిల్లీలో ముఖ్యమంత్రి నిర్వహించిన దీక్ష లో మాత్రం అశోక్ పాల్గొన్నారు. తాము రాజకీయంగా విబేధించిన కాంగ్రెస్ నేత కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలో చేరటానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని అశోక్ తప్పు బడుతున్నట్లు సమాచారం. పార్టీ నిర్ణయాల్లో తనకు సీనియర్ గా ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో అశోక్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
అశోక్ ఆగ్రహానికి కారణాలేంటంటే..
విజయనగరం ఎంపీగా పోటీ చేసిన అశోక్ గజపతి రాజు కేంద్రంలో మంత్రిగా పని చేసారు. ఆయన విజయనగరం జిల్లా లో సుజయ రంగారావు ను టిడిపిలో చేర్చుకొనే సమయంలోనూ తనకు ఇష్టం లేకపోయినా..ముఖ్యమంత్రి మాట కోసం అంగీకరించానని అశోక్ తన సన్నిహిత వర్గాల వద్ద అప్పట్లోనే వాపోయారు. ఇక, జిల్లాలో తాను చెప్పిన అభివృద్ది కార్య క్రమాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉంటే..కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసే అంశంలో కనీసం తనకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా..నిర్ణయం తీసుకున్న తరువాత చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక, తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ చంద్ర దేవ్ ను పార్టీలోకి ఆహ్వానించే సమయంలో తనకు ఏ మాత్రం ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఏక పక్షంగా నిర్ణ యం తీసుకోవటం పై అశోక్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ పై ముఖ్యమంత్రి ప్రతిపాదన లతో విభేదించినట్ల పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేద అనే ఉత్కంఠ ఇప్పుడు టిడిపిలో కొత్త చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications