ఉండవల్లి ఊసరవెల్లిలా మాట్లాడకండి.. ఆర్ఎస్ఎస్‌పై విమర్శలా.. మరీ నెహ్రూ అలా: విష్ణువర్ధన్
సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. మీకు ఏం తెలుసు.. నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను గౌరవించారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి నేతలు మాత్రం మర్యాద ఇవ్వడం లేదని.. లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేశారు.
ఉండవల్లి ఊసరవల్లిగా మారొద్దు అంటూ విష్ణు ట్వీట్ ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ గురించి ఎందుకు పదే పదే కామెంట్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? అని కామెంట్ చేయడం సరికాదన్నారు. కానీ బీజేపీలో చేరే వాళ్లకు తెలుసు.. ఆ పార్టీ గురించి అని విష్ణు పేర్కొన్నారు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీ సలహాలను ఎవరు తీసుకుంటారు అని మండిపడ్డారు. అవన్నీ భ్రమలే అని చెప్పారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ గురించి విమర్శలు చేశారని.. మాజీ ప్రధాని నెహ్రూ 1963 జనవరి 26వ తేదీన ఆర్ఎస్ఎస్‌ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో ఆహ్వానించారని విష్ణు తెలిపారు. చరిత్ర తెలిసినట్లు 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి వక్రీకరించి హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో ఇవాళ అత్యున్నత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని పదవుల్లో దేశం కోసం చాలా మంది పనిచేస్తున్నారని తెలిపారు.
ఏ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో బతికించాలి అని తాపత్రయ పడుతున్నారో అందరికీ తెలుసు అని విష్ణు చెప్పారు. దాని వెనుక ఉన్న రహస్యం కూడా ప్రజలకు తెలుసు అని చెప్పారు. మీ మాటలు, నడవడిక ప్రజలు అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications