శ్రీరాముని కృప వల్ల.. బొత్సకు కేబినెట్‌లో చోటు..? సీనియర్‌కు మరోసారి అవకాశం

ఏపీ కేబినెట్ కొలిక్కి వచ్చింది. గవర్నర్‌కు జాబితా అందింది. అయితే అందులో కొత్త వారు ఓకే.. పాత వారికి సంబంధించి మార్పులు, చేర్పులు చేసి గవర్నర్‌కు అందజేశారు. మంత్రివర్గంలో స్థానంపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ కొత్త కేబినెట్ కూర్పుపై కసరత్తు చేశారని పేర్కొన్నారు. శ్రీరాముని కృప వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు. బొత్స తొలి నుంచి ఇలానే చెబుతున్నారు. రాజీనామా చేసిన వెంటనే దేవుడు, జగన్ దయ అన్నారు.. ఇప్పుడు శ్రీరామునిని విశ్వసించారు. ఇప్పుడు అవకాశం రానే వచ్చింది. మంత్రిగా మరో ఛాన్స్ వచ్చింది. దీంతో నాలుగోసారి ఆయన మంత్రి పదవీ చేపట్టబోతున్నారు.

 25 మందితో జాబితా..

25 మందితో జాబితా..


కేబినెట్ పాత మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. కొత్త కేబినెట్ కొలువు తీరడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏపీ రాజ్ భవన్‌కు జీఏడీ అధికారులు చేరుకున్నారు. సీల్డ్ కవర్‌లో ఏపీ కొత్త మంత్రుల జాబితా ఉంది. గవర్నర్ స్పెషల్‌ సీఎస్‌కు జీఏడీ అధికారులు సీల్డ్ కవర్ అందించారు. 25 మంది పేర్లతో కూడిన మంత్రుల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించగా.. ఆమోదించినట్టు సమాచారం

 జిల్లాల వారీగా వీరే..

జిల్లాల వారీగా వీరే..


ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరకు చోటు లభించింది. విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు అవకాశం లభించింది.

పాతవారు వీరే..

పాతవారు వీరే..


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికేబినెట్‌లో తిరిగి చోటు లభించింది. ఆర్కే రోజా, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున కేబినెట్‌లో అవకాశం కలిగింది. విడదల రజనీ, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ బాషా.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీచరణ్‌, తిప్పేస్వామి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+