• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపిలో చంద్ర‌బాబు బీసీ బాణం..! బీసి ల కోసం టీడిపి ఎంతో శ్ర‌మించింద‌న్న బాబు..!!

|
  AP Elections 2019 : Chandrababu Has Announces Gifts To The BC Caste Corporations | Oneindia Telugu

  అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు చంద్రబాబు వరాలు కురిపించారు. వైసీపీ, బీజేపీ లు ఎన్ని కుట్ర‌లు చేసినా బీసీలంతా త‌న వైపే ఉన్నారని తెలిపారు. తాను చేపడుతున్న సంక్షేమ పథకాల్లో 50 శాతం బీసీలకే వ‌ర్తించేలా జాగ్ర‌త్తులు తీపుకున్నాన‌ని, జనవరి నెలలో 1 వెయ్యి, ఫిబ్రవరి నెలలో 2వేలు, మొత్తం 3వేల రూపాయలు పెన్షన్ మీ పెద్ద కొడుకుగా ఇంటికి పంపిస్తున్నాని అన్న‌రు చంద్ర‌బాబు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి బీసీల కోసమే వెచ్చిస్తానని, బీసీల అభివృద్ధికి సహకరిస్తానని, బీసిల ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నార‌ని, బీజేపీ, వైసీపీ పైన బాబు ద్వ‌జ‌మెత్తారు.

  అన్ని కులాలకు కార్పొరేషన్లు, నిధులు..! జ‌య‌హో బీసి స‌భ‌లో చంద్ర‌బాబు..!!

  అన్ని కులాలకు కార్పొరేషన్లు, నిధులు..! జ‌య‌హో బీసి స‌భ‌లో చంద్ర‌బాబు..!!

  తూర్పు గోదావ‌రి జిల్లా రాజమండ్రి లో జరిగిన జయహో బీసీ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. బీసీలకు గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లేనని, 1987లో ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్ పెట్టారు దానివల్ల నాయకత్వం వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 1995 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 33 శాతం చేసాన్నారు. నేషనల్ ఫ్రంట్ వచ్చిన తర్వాత విప్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎనిమిది మంది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. జడ్జీలు అందర్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు నియమించినా మనకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఫారసు చేసిన‌ట్టు, తమ పాలనలో అన్ని వ్యవస్థల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు బాబు తెలిపారు.

  బ‌స‌వ తార‌కం స్వ‌గ్రామం : భువ‌నేశ్వ‌రి ద‌త్త‌త : నారా దేవాన్ష్ కాల‌నీ..!

  బీసిల కోసం వైయ‌స్ ఏమీ చేయ‌లేదు..! బీసి సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉంది టీడిపీనే..!!

  బీసిల కోసం వైయ‌స్ ఏమీ చేయ‌లేదు..! బీసి సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉంది టీడిపీనే..!!

  వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు ఏమైనా చేశారా అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలని అణగదొక్కిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అన్నారు. 31 కులాలని బీసీలో కి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ కల్పించకుండా అన్యాయం చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. బీసీలను దెబ్బతీయడానికి మరోపక్క వైసీపీ బీజేపీ లు కుట్రపన్నాయ‌ని బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. బీసీలకు అండగా ఉంటా మీ సంక్షేమం కోసం పోరాడుతాం అందుకోసమే జయహో బీసీ స‌భ నిర్వ‌హించాన‌ని చంద్ర‌బాబు తెలిపారు.

  బీసీలెవ్వ‌రూ అధైర్య ప‌డొద్దు..! టీడిపి అండ‌గా ఉంటుందన్న బాబు..!!

  బీసీలెవ్వ‌రూ అధైర్య ప‌డొద్దు..! టీడిపి అండ‌గా ఉంటుందన్న బాబు..!!

  రజక, నాయి బ్రాహ్మణ, వడ్రంగి, సగర, ఉప్పర, కృష్ణ బలిజ, పూసల, వాల్మీకీ బోయ, భట్రాజ, కుమ్మరి, యాదవ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీ సైనా, మత్స్యకారులు, తూర్పు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. రాయలసీమలో "కురబలు" ఉన్నారని, వీరికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. యాదవుల గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని. అగ్నికుల క్షత్రియులను ఎస్టీలో చేర్చడానికి ఒక కమిషన్ వేసామ‌ని. నివేదిక రాగానే ఢిల్లీ పంపించి అమలయ్యేలా చేస్తానన్నారు చంద్ర‌బాబు.

  బీసిల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించింది టీడిపీనే..! లోటు బ‌డ్జెట్ ఉన్న హామీల‌న్నీ నెర‌వేర్చామ‌న్న లోకేష్..!

  బీసిల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించింది టీడిపీనే..! లోటు బ‌డ్జెట్ ఉన్న హామీల‌న్నీ నెర‌వేర్చామ‌న్న లోకేష్..!

  తెలుగుదేశం పార్టీ పునాది బీసీ సోదరులని, దేశంలో బీసీలకు ఉన్నది ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 16 వేలకోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. భారతదేశ చరిత్రలో 24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుది. డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ కి పసుపు కుంకుమ నిమిత్తం పదివేల రూపాయలు ఇస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నామ‌ని లోకేష్ తెలిపారు.

  English summary
  Chandrababu has announces gifts to the BC caste corporations. The YCP and the BJP have made many allegations, but the BC's are on his way. Babu said that he has made gestures to apply to 50 per cent of the welfare schemes he has undertaken.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X