జనసేన లో కొత్త జోష్: బాబాయ్ కోసం చెర్రీ పాట : ఎన్నికల ప్రచారంలోనూ నిలుస్తారా..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కు మెగా కుటుంబం నుండి రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాన్ కు మోరల్ గా మద్దతు ఇస్తున్నారు. చిరంజీవి కుమారుడు రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత..బాబాయ్ పవన్ ప్రత్యేకతలను జనసేన పార్టీగా తీర్చి దిద్దారు. ఇప్పుడు రామ్ చరణ్ తేజ పోస్ట్ చేసిన ఆ పాట సంచనలం సృష్టిస్తోంది. మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

జనసేనై కదిలాడు..పవన్ పై చెర్రీ అభిమానం..
రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై సినీ హీరో రామ్ చరణ్ ఓ పాట రూపొందించారు . ఆ పాట ను ఫేస్‌బుక్ లో పోస్టు చేశారు. దేశం కోసం పాటు బడ్డ జాతీయ నాయకులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు చెర్రీ పేర్కొన్నారు. ఒకడొచ్చాడు..వచ్చడు..అంటూ జనసేనౌ కదిలాడు అంటూ ఈ పాట సాగుతోంది.
పవన్
రాజకీయంగా పవన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనూ..ఆ తరువాత పవన్ ఒక్కరే కనిపించారు. ఆ తరువాత పార్టీ క్రమేణా ప్రజల్లోకి వచ్చింది. నేతలూ చేరుతున్నారు. తన అన్నయ్యను కాదని తాను పార్టీని పెట్టానని పవన్ చెప్పిన సందర్బాలు ఉ న్నాయి. అయితే, పవన్ కు రాజకీయంగానూ మెగా కుటుంబం మద్దతు ఇస్తోంది. శ్రీరెడ్డి అంశం లో నాగబాబు పవన్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. చిరంజీవి తనయుడు రాం చరణ్ ప్రతీ సందర్భంలోనూ తన బాబాయ్ పై ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. ఇక, తాజాగా పవన్ కు మద్దతుగా విడుదల చేసిన పాట మొత్తం జనసేన పార్టీ కోసం వపన్ చేస్తున్న యాత్రల్లో భాగంగా ఉన్న సన్నివేశాలనే వీడియో లో వినియోగించారు.

పవన్ కు రాజకీయంగానూ మద్దతు..
పవన్ కళ్యాన్ కు రాజకీయంగా రాం చరణ్ ఈ పాట ద్వారా మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాన్ లక్షణాలను ..ఆలోచనలను ఈ పాట ద్వారా..జాతీయ నేతల ఆశయాలను వివరిస్తూ పాట ముందుకు సాగింది. ఇప్పటికే పవన్ సోద రుడు నాగబాబు సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ద్వారా జగన్ ను ..లోకేష్ పైనా సెటైర్లు వేస్తున్నారు. ఇక, అల్లు అర్జున్ సైతం పవన్ కు బాసటగా ఉన్నారు. అయితే, చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు పవన్ రాజకీయ పార్టీ పై ఏ సందర్భం లోనూ ప్రస్తావించ లేదు. ఆయన కాంగ్రెస్ లో ఉంటున్నా.. యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. ఇక, ఇప్పుడు రాం చరణ్ విడదల చేసిన పాటను చూసిన తరువాత మెగా హీరోలు తాము అభిమానించే పవన్ కళ్యాన్ కు మద్దతుగా ఎన్ని కల ప్రచారంలోకి దిగుతారా అనే ప్రశ్న మొదలైంది. ప్రజారాజ్యం పార్టీ కోసం మెగా సోదరులు కలిసి కట్టుగా పని చేసా రు. ఇప్పుడు రాం చరణ్ బాగా యాక్టివ్ అయ్యారు. దీంతో..మెగా హీరోలు పవన్ కోసం మద్దతుగా ప్రచారం లోకి దిగే చాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే..జనసేన కు మరింత ఊపు రావటం ఖాయం.












Click it and Unblock the Notifications