ఏం చేస్తార‌య్యా..జైల్లో పెడ‌తారా : ఎవ‌డ‌బ్బ సొమ్ము అది : ఆవేశంతో ఊగిపోయిన చంద్ర‌బాబు..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీ సాక్షిగా బిజెపి శాస‌న‌స‌భా ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు పై మండిప‌డ్డారు. కేంద్రం సాయం అందిస్తుందంటూ విష్ణు కుమార్ రాజు ప్ర‌సంగిస్తుండ‌గా జోక్యం చేసుకున్న ముఖ్య‌మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ..ఎమ్మెల్యే ఉండ‌టానికి అన్ ఫిట్ అని ఫైర్ అయ్యారు.

ఏం చేస్తారాయ్యా...జైల్లో పెడ‌తారా..

ఏం చేస్తారాయ్యా...జైల్లో పెడ‌తారా..

ఏపి శాస‌న‌స‌భ‌లో ఏపికి కేంద్ర సాయం పై చ‌ర్చ నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో బిజెపి శాస‌న‌స‌భా ప‌క్ష నేత విష్ణుకుమా ర్ రాజు కేంద్రం ప్ర‌క‌టించిన‌వే కాకుండా చెప్ప‌న‌వి సైతం చాలా ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఆ స‌మ‌యంలో స‌భ లోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విష్ణుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని.. ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండటానికి విష్ణుకుమార్ రాజుకు అర్హత లేదన్నారు. రక్తం ఉడికిపోతుందన్నారు. ఎవరికి ఊడిగం చేస్తారు? ఏం చేస్తారయ్యా మీరు? జైల్లో పెడతారా... ఆవేదన ఉండదా మాక.. త‌మిళ‌నాడుకు ఎన్ని ఇచ్చారు.. గుజరాత్‌కి ఎన్ని ఇచ్చారు. రోషం లేదా .. తమాషాగా ఉందా.. న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టాం. వినేవాళ్లు ఉంటే చెవుల్లో పువ్వు లు పెడతారండి. మహిళలు వచ్చి.. పోరాడతామంటున్నారని.. పెన్షన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నారని .. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అడుగుతున్నారని అని ఫైర్ అయ్యారు.

వ్య‌తిరేకంగా మాట్లాడితే అంతేనా..

వ్య‌తిరేకంగా మాట్లాడితే అంతేనా..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్రత్యేక హోదాపై తాను మాట మార్చలేదని.. కేంద్రమే తప్పుడు సమచారమిచ్చి.. అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో మోసం చేశారని.. ఆ సంఘం చైర్మన్ హోదాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా చెప్పార న్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్యాకేజీ పేరు చెప్పిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. డబ్బులు ఇవ్వండని అడి గితే అప్పు ఇస్తానంటున్నారని.. అప్పు ఇస్తే.. తాను సంపాదించుకోలేనా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ఇగోని సంతృప్తి ప‌ర్చ‌నాటికి త‌గ్గాను.

ఇగోని సంతృప్తి ప‌ర్చ‌నాటికి త‌గ్గాను.

ప్ర‌సంగం మొత్తం అవేద‌న‌తో మాట్లాడిన ముఖ్య‌మంత్రి బిజెపి స‌భ్యుల‌ను నిల‌దీసారు. మీరు ఇచ్చింది ఏంటి.. మేము పన్నులు కట్టడం లేదా.. నాకు హక్కు లేదా .. నాకు అన్యాయం జరిగినప్పుడు.. నాకు ఎందుకు ఇవ్వరు.. దేశంలో భాగంగా లేమా .. తమిళనాడులో, ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందో ఆలోచించుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడితే ఫినిష్ చేయాలని చూస్తారు. ఎవరో ఒకరు సాయం చేస్తారనుకున్నాను. హోదా ఇవ్వకపోయినా.. ఏ పేరుతో ఇచ్చినా.. రాష్ట్రాన్ని ఆదుకుంటే సరిపోతుందనుకున్నాను. అన్నీ దిగమింగుకుని .. ఈగోని సంతృప్తి పరుస్తుంటే.. మట్టి, నీళ్లు ముఖాన కొట్టి వెళ్లారు అంటూ ముఖ్య‌మంత్రి ఫైర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+