పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా అరకులోయలో నమోదు..

రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రరూపం దాల్చాయి. చలిగాలులు మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో గల పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

విశాఖలో

విశాఖలో


ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో.. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి అని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా రాత్రిపూట రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి గాలుల తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్

2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్

తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. చలిగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈశాన్య దిశ నుంచి ..కిందిస్ధాయిగా శీతలగాలులు వీస్తున్నాయని అధికారులు వివరించారు. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2నుండి 4 సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

పాడేరు

పాడేరు

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ఏరియాలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయి. తెలంగాణలో గల ఆదిలాబాద్, ఏపీలోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో గల ఏజెన్సీ ఏరియాలో సాయంత్రం వేళకే శీతలగాలులతో మంచు తెరలు కమ్నుకుంటున్నాయి. మంచు కారణంగా రాత్రిపూట వాహానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. చలి తీవ్రత పెరగటంతో చిన్నారులు వృధ్దులు, గర్భిణీలు, శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా పాడేరులో 10 డిగ్రీలు, మినుములురు 8 డిగ్రీలు, చింతపల్లి 9.8 డిగ్రీలు, అరకులోయలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+