వాట్ నెక్ట్స్: దివ్యవాణి చూపు ఎటువైపు.. కమల దళంలో చేరేందుకు ఇంట్రెస్ట్
దివ్య వాణి ఎట్టకేలకు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనే చర్చ జరుగుతుంది. వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు తక్కువే.. ఆమె బీజేపీ వైపు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ పెద్దలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లేదంటూ.. దివ్యవాణి ఇవాళే టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని దివ్యవాణి రాజీనామాస్త్రం సంధించారు. ఆ వెంటనే వెనక్కి తీసుకున్నారు. కానీ ఇవాళ మరోసారి రిజైన్ చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడారు. దీంతో రాజీనామాపై దివ్యవాణి వెనక్కి తగ్గారు. కానీ ఫలితం లేదు. టీడీపీలో గుర్తింపు దక్కడం లేదని పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు అదే విషయం తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. సినీ నటి, టీడీపీ నేత అయినత దివ్యవాణి పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. యాక్టివ్‌గా ఉంటున్నారు.. ఇంతలో రాజీనామా చేయడం.. ఆ వెంటనే విత్ డ్రా చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమె రాజీనామాస్త్రానికి గల కారణం మాత్రం తెలియరాలేదు.












Click it and Unblock the Notifications