వైసీపీలో గంటా చేరిక ముహూర్తం ఖరారు..? సీఎం జగన్ సమక్షంలో రేపే చేరిక
వైసీపీలోకి మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు చేరిక అంశం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఆయన చేరతారని.. చేరరని... అనుబంధ సభ్యుడిగా కొనసాగుతారని రకరకాల ప్రచారం జరిగింది. అయితే గంటా శ్రీనివాస్ కాక ఆయన కుమారుడు రవితేజ చేరికపై మాత్రం స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు (శనివారం) రవితేజ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు.
Recommended Video

గంటా కుమారుడు చేరిక..?
తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో రవితేజతో పాటు గంటా శ్రీనివాసరావు అనుచరులతో చేరుకుంటారు. సీఎం జగన్‌ను కలిసి ముచ్చటిస్తారు. తర్వాత రవితేజ వైసీపీలో చేరతారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే గంటా మాత్రం అనుబంధ సభ్యుడిగానే కొనసాగుతారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరికపై స్పష్టత లేకుండా పోయింది.

విజయసాయి నిప్పులు..
గంటా శ్రీనివాస రావుపై వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి గుర్రుమీదున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి జరిగిందని ట్వీట్ చేశారు. దానికి మూల్యం తప్పదని కామెంట్ చేశారు. జగన్‌తో విజయసాయికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో విజయసాయి గంటాను బాహాటంగా విమర్శించడం చర్చకు దారితీసింది. అయితే గంటా కాకుండా ఆయన కుమారుడు పార్టీలో చేరడం స్ట్రాటజీ అనే అనుమానాలు కలుగుతున్నాయి.

టీడీపీ-వైసీపీలో ఇలా
ఇటు టీడీపీలో కూడా గంటా అంటే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పార్టీకి దూరంగా ఉండటంపై గుర్రుమీదున్నారు. ఇదివరకు పార్టీలో చేరే సమయంలోనే.. వీడటం ఎందుకు, ఉండాలని చురకలు అంటించారు. ఇప్పుడు మళ్లీ పార్టీ వీడుతున్నారనే ప్రచారంపై విమర్శిస్తున్నారు. అయితే గంటా మాత్రం టీడీపీలో ఉండలేక.. ఉన్నా విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు వైసీపీలో కూడా అదే పరిస్థితి. విజయసాయి విమర్శలు దీనికి అద్దం పడుతున్నాయి. మొత్తానికి గంటా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications