బాబును ఏమనకుండా చిరంజీవి వైపు వెళ్లా: గంటా, 'జగన్‌కు రాజకీయాలు నేర్పేందుకే వారు వైసీపీలోకి'
విశాఖపట్నం/అమరావతి: ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి, ఇప్పుడు పార్టీని వీడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించడాన్ని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఖండించారు. గతంలో తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లేముందు చంద్రబాబును ఒక్క మాట అనకుండా వెళ్లిపోయానని గుర్తు చేశారు.
చంద్రబాబుపై, టీడీపీపై అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. చంద్రబాబును కాపుమిత్ర అని ప్రశంసించిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఆయనను కాపు వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారన్నారు. అవంతి కోసం భీమిలి నియోజకవర్గాన్ని సైతం వదులుకోవడానికి తాను సిద్ధపడ్డానని, అయినప్పటికీ, పార్టీని ఆయన వీడారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ బయటకు వెళ్లారని చెప్పారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్‌లకు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని మరో టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. గతంలో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రపై ఆమంచి రాళ్లు వేయించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో చేరడం విడ్డూరమన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత ఎస్పీని ఆమంచి ట్రాన్స్‌ఫర్ చేయించారన్నారు. వైసీపీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల పార్టీ టీడీపీ అని చెప్పారు. జగన్‌కు రాజకీయాలు నేర్పడానికే ఆమంచి, అవంతిలు ఆ పార్టీలో చేరినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications