డర్టీ ఎంపీ సచ్చీలుడా..? మహిళల దెబ్బ గట్టిగా తగులుతుంది: టీడీపీ నేత అనిత
న్యూడ్ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ కాదని అనంతపురం ఎస్పీ చెప్పడంతో ఈ అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఇష్యూపై టీడీపీ నేత వంగలపూడి అనిత కూడా స్పందించారు. ఎంపీ మాధవ్ విషయంలో అనుకున్నట్టే జరిగిందని ఆమె అన్నారు. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవి అన్నీ చేస్తున్నారని ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్ సచ్ఛీలుడు అనే సర్టిఫికెట్ ఇస్తున్నారని విమర్శించారు.
అది ఒరిజినలో, కాదో అని నిర్ధారించలేకపోతున్నాం అని మీరు చెప్పారు... బాగుంది. మరి అలాంటప్పుడు అది ఎడిటింగ్, మార్ఫింగ్ అని ఎలా చెబుతారు? నిజం నిలకడ మీద కచ్చితంగా బయటికి వచ్చి తీరుతుందని అనిత అన్నారు. ఈ డర్టీ ఎంపీని సమర్థించిన వారందరూ ఆ రోజు తలదించుకోకతప్పదని అనిత అని స్పష్టం చేశారు. ఈ వీడియో వ్యవహారాన్ని సమర్థిస్తున్నారా, లేదా అనేది సీఎంగా జగన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అనిత డిమాండ్ చేశారు. ఎంపీ మాధవ్ మీద చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర మహిళల దెబ్బ గట్టిగా తగులుతుందని హెచ్చరించారు.

Recommended Video

గోరంట్ల మాదవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ స్పష్టంచేశారు. ఆ వెంటనే ఎంపీ గోరంట్ల మాదవ్ అటాక్ చేశారు. లోకేశ్, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత నారా లోకేశ్ స్పందించారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యలను తప్పుబట్టారు. వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చురో చెప్పాలని ప్రశ్నించారు. ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వీడియో ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నాం అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. వీడియోను మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీడియోకు సంబంధించి బాధితులెవరు ఫిర్యాదు చేయలేదని వివరించారు. వీడియోని మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications