Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొత్తుపై బాబుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో లాజిక్ మిస్ అయిన పవన్: సోషల్ మీడియాలో సెటైర్లు

పవన్ కళ్యాణ్‌ టీడీపీతో కలిసి పని చేస్తే జగన్‌కు ఏంటి నొప్పి అంటూ ఆదివారం ఏపీ సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు చంద్రబాబు. అయితే జనసేన తిరిగి టీడీపీతో కలిసి వెళుతుందా అనే చర్చ ఏపీలో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బుధవారం పవన్ చేసిన పాత ట్వీట్‌ను ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ నానా హంగామా క్రియేట్ చేసింది. జనసేన సొంతంగా పోటీ చేస్తుందని పవన్ తాజా స్టేట్ మెంట్ చేయకముందే ఆ ఛానెల్ పవన్ క్లారిటీ ఇచ్చేశారంటూ ప్రచారం చేసింది. అయితే ఆ ఛానెల్ తెలిసో తెలియకో పాత ట్వీట్‌ను ప్రసారం చేసినప్పటికీ పవన్ మాత్రం తాజగా అంటే గురువారం ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జనసేన వామపక్షాలతో కలిసి పోటీచేస్తుందంటూ చెబుతూనే సంపూర్ణంగా 175 స్థానాల్లో బరిలో దిగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ పవన్ చిన్న లాజిక్ మిస్ అయ్యారంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

 175 స్థానాలపై నెటిజెన్లు సెటైర్లు

175 స్థానాలపై నెటిజెన్లు సెటైర్లు

తాము వామపక్షాలతో తప్ప మరెవరితో కలిసి 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేయమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుందని చెప్పారు. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం కల్పిస్తామని జనసేనాని స్పష్టం చేశారు. అధికార పక్షం ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దంటూ వాటిని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్... వారికి కనీసం ఒకటి రెండు సీట్లు అయినా ఇవ్వరా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక ఐదు సీట్లు వామపక్షాలకు ఇచ్చినా... జనసేన పోటీచేసే స్థానాలు 170 అవుతుంది. ఓ వైపు వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని చెబుతూనే మరోవైపు జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పడం ఏంటంటూ కొందరు టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

 కన్ఫ్యూజన్‌ క్రియేట్ చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు

కన్ఫ్యూజన్‌ క్రియేట్ చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు

ఏపీలో 2019 సాధారణ ఎన్నికలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. త్రిముఖ పోటీ ఏపీలో నెలకొనడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ... ఆ తర్వాత కొన్ని మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం ఆయన తన పార్టీ నిర్మాణ కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీచేస్తే తప్పేంటి అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు బీజేపీయేతర పార్టీలతో పవన్ జట్టు కట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం మరింత డోలాయమానంకు గురించేసింది. ఎంతలా అంటే పవన్ తిరిగి చంద్రబాబుకు మద్దతు పలుకుతారా అనే చర్చ కూడా మొదలైంది.

నాడు బహిరంగ మిత్రులు నేడు రహస్య మిత్రులు: వైసీపీ

నాడు బహిరంగ మిత్రులు నేడు రహస్య మిత్రులు: వైసీపీ

ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ కౌంటరిచ్చింది. అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లు ఎప్పుడు విడిపోయారని తిరిగి కలిసేందుకు అంటూ ఛలోక్తులు విసిరింది. నాడు బహిరంగ మిత్రులు నేడు రహస్య మిత్రులుగా మారారంటూ వైసీపీ సెటైర్ వేసింది. మరోవైపు సీపీఐ నేత నారాయణ కూడా స్పందించారు. ఓటమి భయంతో చంద్రబాబు పవన్‌తో పొత్తు కోసం పాకులాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన వామపక్షాలు కలిసి 2019లో పోటీచేస్తాయని నారాయణ స్పష్టం చేశారు. నిన్నటి దాకా పవన్‌ను విమర్శించిన చంద్రబాబు... నేడు పొత్తుల కోసం ఆహ్వానించడం ఆశ్చర్యానికి గురిచేసిందని నారాయణ చెప్పారు.

కొత్త తరం నాయకుల కోసం జనసేన ఎదురుచూస్తోంది: పవన్

కొత్త తరం నాయకుల కోసం జనసేన ఎదురుచూస్తోంది: పవన్


ఇలాంటి చర్చలకు, రూమర్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా తన స్టాండ్ స్పష్టం చేశారు. 2019లో జనం బలంతోనే జనసేన 175 స్థానాలలో పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క వామపక్షాలతో తప్ప మరెవరితోను జనసేన కలిసి పోటీచేయదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. యువతకు పెద్ద పీట వేయాలన్నదే జనసేన లక్ష్యమని చెప్పారు. సుస్థిర రాజకీయ వ్యవస్థ నెలకొల్పడమే తన ధ్యేయమని చెప్పారు. కొత్త తరం నాయకుల కోసం చూస్తున్నట్లు చెప్పిన పవన్.. 25 ఏళ్ల వరకు యువత భవిష్యత్తుకు అండగా ఉండటమే తమ ధ్యేయం అన్నారు పవన్.

మొత్తానికి పవన్ ట్వీట్‌తో ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారనుంది. ఇక అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వ్యూహాలు ప్రతివ్యూహాలు, సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+