పవన్ కళ్యాణ్ టార్గెట్ 60, వైసీపీ-టీడీపీ పరిస్థితి ఇదేనా?: జగన్‌ను అలా దెబ్బకొట్టారు!
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో త్రిముఖపోటీ ఉండనుంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోరు ఉండనుంది. 175 నియోజకవర్గాలకు గాను హోరాహోరీ అధికార, ప్రతిపక్షాల మధ్యే ఉండనుందని చాలామంది భావిస్తున్నారు. పలుచోట్ల జనసేన.. టీడీపీ, వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపించడంతో పాటు ఆ పార్టీ కూడా రానున్న ప్రభుత్వంలో కీలకమయ్యేలా సీట్లు గెలుచుకోనుందని భావిస్తున్నారు.

టార్గెట్ 60.. గెలుపు 30
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 88. టీడీపీ, వైసీపీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినందున ఈ రెండు పార్టీలు కూడా మేజిక్ ఫిగర్‌కు చేరుకోవడం సులభమైన విషయమేమీ కాదని చెబుతున్నారు. ఓ విధంగా కర్ణాటక తరహా పరిస్థితులు ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. ప్రధానంగా జనసేనాని ఏపీవ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ ఆ పార్టీ అంతర్గతంగా దాదాపు 60 నుంచి 90 స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇందులో 30కి పైగా స్థానాలు గెలుచుకోవచ్చునని భావిస్తోందట. జనసేనకు లెఫ్ట్ పార్టీ తోడవడం వల్ల మరిన్ని సీట్లు గెలుచుకోనుందని అంటున్నారు.

అదే నిజమైతే పవన్ మద్దతు అవశ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీకి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉండదని భావిస్తున్నారట. అంటే ఏ పార్టీ అయినా డెబ్బై నుంచి ఎనభై సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని చెబుతున్నారు. అదే నిజమైతే అప్పుడు వచ్చే ప్రభుత్వంలో జనసేన కీలకంగా మారనుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన పార్టీయే అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

జగన్‌ను అలా దెబ్బతీసిన చంద్రబాబు
చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఇటీవలి వరకు విపక్షాలు చెప్పాయి. అయితే, ఆ తర్వాత చంద్రబాబు ప్రకటించిన పథకాలు కొంత సానుకూలతను తీసుకువెళ్లాయని అంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ పుంజుకుందని చెబుతున్నారు. ఓ విధంగా ఇటీవల వరుస పథకాల వల్ల చంద్రబాబు.. జగన్‌ను దెబ్బతీశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ పథకాలను టీడీపీ కాపీ చేసిందని చెబుతున్నప్పటికీ.. ఆ పథకాలు మాత్రం జగన్‌ను ఒకింత కార్నర్ చేశాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే పవన్ కీలకం కానున్నారని చెబుతున్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!











Click it and Unblock the Notifications