ఏపీలో మంకీ పాక్స్ కలకలం..? దుబాయ్ నుంచి వచ్చిన చిన్నారికి లక్షణాలు..
ఇప్పుడు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. నిన్న, మొన్నటివరకు కరోనా కేసులతో అల్లాడగా.. ఇప్పుడు కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది. దేశంలో ఒకరికీ వైరస్ రాగా.. మిగతా వారిని భయపెడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంకీ పాక్స్‌కు సంబంధించి గైడ్ లైన్స్ జారీచేసింది. ఇక తెలుగు రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంకీ పాక్స్ కలకలం రేగింది. ఒకరికి వైరస్ సోకిందనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఫస్ట్ మంకీ పాక్స్ కేసు
రెండు రోజుల క్రితం ఇండియాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏపీలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయని వైద్య అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. దీంతో అలర్ట్ అయ్యారు.

దుబాయ్ నుంచి వచ్చిన చిన్నారి
దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దీంతో అదీ మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి నమూనాలను సేకరించి పూణె ల్యాబ్‌కు పంపించారు. చిన్నారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచారు. సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

21 రోజుల తర్వాతే
ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా సోకే అవకాశం ఉంది. గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా వ్యాపిస్తుందట. మనషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకరు మంకీపాక్స్‌కు గురైన సమయంలో వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుందట. అలాగే మంకీ పాక్స్ వచ్చిన వారికి జ్వరం,
తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, చలి, అలసట ఉంటుంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications