జ‌న‌సేన‌ ఎంపీగా బ‌రిలోకి నాగబాబు: ప‌వ‌న్ పోటీ స్థానం పైనా క్లారిటీ : పాల‌కొల్లు పై ఇలా...!

Recommended Video

    AP Elections 2019 : Pawan Kalyan's Brother Nagababu May Contest As Mp From Janasena | Oneindia

    జ‌న‌సేన లో ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల ఖ‌రారు పై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. అయితే, ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులుగా పోటీ చేసే లిస్టు లోని కొంద‌రు కీల‌క వ్య‌క్తుల పేర్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారు తున్నాయి. అందులో ప్ర‌ధానంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ రెండు స్థానాల నుండి పోటీకి దిగుతున్న‌ట్లు స‌మాచారం. రాయ‌ల‌సీమ తో పాటుగా విశాఖ లో మ‌రో స్థానం ఎంచుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

    ఎంపీగా బ‌రిలోకి నాగ‌బాబు..

    ఎంపీగా బ‌రిలోకి నాగ‌బాబు..

    ప్ర‌జారాజ్యం లో అన్న‌య్య చిరంజీవి కోసం శ‌క్తి వంచ‌న లేకుండా ప‌న చేసిన నాగ‌బాబు ఆ స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. అయితే, ఇప్పుడు త‌మ్ముడు పార్టీ జ‌న‌సేన నుండి మాత్రం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశాలు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. గుంటూరు లో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో తాను సాధార‌ణ కార్య‌క‌ర్త‌ను మాత్ర‌మే అని చెప్పిన నాగ‌బాబును ఎంపీగా బ‌రిలోకి దింపాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. నాగబాబు ను గుంటూరు లేదా న‌ర్సాపురం నుండి జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేయించాల‌ని భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అందులో భాగంగానే..గుంటూరు లో పార్టీ ప‌రిస్థితి పై నాగ‌బాబు ఆరా తీసిన‌ట్లు చెబుతున్నారు. నాగ‌బాబు బ‌రిలో దిగ‌టానికి ఆమోద ముద్ర వేయ‌గానే ఆయ‌న పేరు ప్ర‌క‌టించేందుకు రంగం సిద్ద‌మైంది. ఇదే జ‌రిగితే ఆ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ అభ్య‌ర్ధుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

    ఏలూరు ఎంపీగా పెంట‌పాటి పుల్లారావు..

    ఏలూరు ఎంపీగా పెంట‌పాటి పుల్లారావు..

    ఏలూరు నుండి జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్ధిగా పెంట‌పాటి పుల్లారావు బ‌రిలోకి దిగటం దాదాపు ఖాయ‌మైంది. కొద్ది రోజుల క్రితం ఆయ‌న ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లో చేరారు. ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల మీద ఆయ‌న ప‌ని చేస్తున్నా రు. రాజ‌కీయ విశ్లేష‌కుడిగానే కాకుండా పోల‌వరం కోసం పోరాడిన వ్య‌క్తిగా పేరుంది. ఇక‌, ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసి పాలకొల్లు స్థానంలో చిరంజీవి ఓడిపోయారు. జ‌న‌సేన నుండి పాల‌కొల్లు నుండి పోటీ చేసి గెల‌వాల‌ని కొంద‌రు నేత‌లు ప‌వ‌న్ కు సూచిస్తున్నారు. అయితే, దీని పై ప‌వ‌న్ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం సైతం ఏలూరు లోక్‌స‌భ ప‌రిధిలోనే ఉండ‌టంతో పార్టీ అభ్య‌ర్దికి క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

    ప‌వ‌న్ పోటీ ఆ స్థానాల్లోనే..

    ప‌వ‌న్ పోటీ ఆ స్థానాల్లోనే..

    జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎక్క‌డి నుండి పోటీ చేస్తార‌నే దాని పై ఆస‌క్తి నెల‌కొని ఉంది. తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం, విశాఖ న‌గ‌రంలోని భీమ‌లి నుండి పోటీ చేస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా విశాఖ లోని గాజు వాక నుండి పోటీ చేస్తార‌నే వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు అక్క‌డి నుండి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ ను కోర‌గా ఆయ‌న సానున‌కూలంగా స్పందించారు. ఇక‌, గ‌తంలోనే ప‌వ‌న్ తాను అనంత‌పురం నుండి పోటీ చేస్తాన‌ని ప్ర‌కటించారు. ఇక‌, నెల్లూరు సిటీ పైనా ప‌వ‌న్ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. నేడో రేపో జ‌న‌సేన పార్టీ అధికారికంగా అభ్య‌ర్ధుల లిస్టు ప్ర‌క‌టించ‌నుంది. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ చౌడ‌వ‌రం తో పాటుగా అనంత‌పురం లేదా నెల్లూరు నుండి బ‌రిలోకి దిగుతార‌ని పార్టీ నేత‌ల స‌మాచారం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+