లోతైన అధ్యయనం, పరిపాలన సౌలభ్యం కోసమే, అనవసర రాద్దాంతం వద్దు: ధర్మాన కృష్ణదాసు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రగడ నెలకొంది. ప్రభుత్వం ఇలా నోటిఫికేషన్ ఇచ్చిందో లేదో.. సంతోషం వెలిబుచ్చేవారు తక్కువ కాగా.. విమర్శలు, తమకు ఈ జిల్లా అని చాలా మంది కోరుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగానే చేపట్టామని వెల్లడించారు.

ఇప్పటి నిర్ణయం కాదు..
అంతేకాదు కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, దీనిపై శాస్త్రీయంగా లోతైన అధ్యయనం జరిగిందని స్పష్టం చేశారు. సత్వర సేవలు, పాలనా పరమైన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ధర్మాన కృష్ణదాసు వివరించారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మహనీయులను స్మరించుకుంటూ, చారిత్రక నేపథ్యాల ఆధారంగా ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ జిల్లా పునర్విభజన జరిగిందని పేర్కొన్నారు.

రాద్దాంతం తగదు
దీనిపై రాద్దాంతం చేయడం తగదని వివరించారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కానీ కొందరు కావాలనే వివాదం రాజేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది.
Recommended Video

ఇలా జిల్లాల విభజన
శ్రీకాకుళం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. ఈ జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విజయనగరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపు కోట, గజపతినగరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా.. ఇంతకుముందు ఉన్నవాటిని కలుపుకొని ప్రకటించారు.












Click it and Unblock the Notifications