కేటీఆర్ ఏపీ కాదు యూపీ పంపు.. జీవీఎల్ నరసింహారావు కొత్త వాదన
మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపింది. తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జరుగుతుందో తెలియాలంటే తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రానికి పంపాలని తన మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ చిచ్చు రాజేశాయి. కేటీఆర్ కామెంట్స్ పై ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. టైమ్, డేట్ చెప్పు కేటీఆర్.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా అని మంత్రి రోజా అంటే.. నాలుగు కాదు 400 బస్సుల్లో ఏపీకి వచ్చి చూడండి అని మరో మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
బీజేపీ కూడా స్పందించింది. బీజేపీకి చెందిన కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోలా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్‌కు సూచించారు. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పాలకులు తమ రాష్ట్ర ప్రజలను ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపాలని జీవీఎల్ సూచించారు. అవినీతిని, అరాచకాలను డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా బుల్డోజింగ్ చేస్తుందో తెలంగాణ ప్రజలు చూస్తారని జీవీఎల్ అన్నారు.

మోడీ నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజలను ఉత్తరప్రదేశ్ పంపే ధైర్యం ఉందా? అంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. జీవీఎల్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ కన్నా యూపీ మరింత మిన్న అనే సంకేతాలను ఇచ్చారు.
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీపై విమర్శలు చేశారు. ఏపీలో కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు చెప్పారని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారట. ఈ కామెంట్స్ పెను దుమారం రేపాయి. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications