ఎస్మాకు అదరం బెదరం: డిమాండ్లు తీర్చేవరకు ఆందోళన: ఏపీ జేఏసీ

పీఆర్సీపై ఉద్యోగులు- ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రణాళిక ప్రకారం ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన లక్షలాదిమందితో నిర్వహించే ఛలో విజయవాడను విజయంతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమం చూసైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశించారు. మెరుగైన పీఆర్సీ కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని తెలిపారు. మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని.. కార్మిక, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు.

Recommended Video

    PRC Issue In AP: సమ్మె వద్దు.. చర్చించుకుందాం AP Govt VS Employees | Oneindia Telugu
    తప్పుడు ప్రచారం ఎందుకు..?

    తప్పుడు ప్రచారం ఎందుకు..?

    మంత్రుల కమిటీ పేరు మీద చర్చలకు పిలిచారనీ ఆ చర్చలకు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జరగని అంశాన్ని, లేని అంశాన్ని ఉద్యోగులకు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. 9 మంది ప్రతినిధుల బృందం చర్చలకు వెళ్లిందని, నలుగురు నేతలు నిర్ణయించుకుని లిఖిత పూర్వకంగా తమ డిమాండ్స్ ఇచ్చామని బొప్పరాజు తెలిపారు. వాటికి ఇప్పటివరకు సమాధానమే లేదన్నారు. ప్రభుత్వానికి స్పష్టమైన అధికారాలు ఉంటే.. లిఖిత పూర్వకంగా ఇచ్చిన వాటికి సమాధానం చెప్పాలన్నారు.

     మూడేళ్ల నుంచి మోసం

    మూడేళ్ల నుంచి మోసం

    మూడేళ్ల నుంచి పలు దఫాలుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసం పోయామని బొప్పరాజు వాపోయారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ నాయకులను తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 13 లక్షలు మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు నమ్మకం పోగొట్టుకున్నారని అన్నారు. అశుతోష్ మిశ్రా నివేదకను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టి తయారు చేసిన నివేదికను బయట పెట్టాలని, అది ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇచ్చిన జీవోలు శాస్త్రీయంగా లేవని మీరే చెప్పారు, వాటిని సరిదిద్దండి అని కోరారు. 10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగారు. రూ.1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. సీపీఎస్, పెన్షనర్లకు రావాల్సిన 5 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ఇప్పించండి అని ప్రభుత్వాన్ని అడిగారు.

    25 కోట్ల బకాయి

    25 కోట్ల బకాయి


    25 కోట్ల హెల్త్ బకాయిలు చెల్లించాలని కోరారు. అన్ని విధాల సిద్ధమై ఉద్యమంలోకి దిగామని, ఎవరికీ భయపడేది లేదని బొప్పరాజు చెప్పారు. మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చేయొద్దు అన్నారు. చర్చలకు సిద్ధంగా ఉన్నాం, లిఖిత పూర్వకంగా ఇచ్చిన వాటికి ముందు సమాధానం చెప్పండని బొప్పరాజు అన్నారు. న్యాయంగా పోరాటం చేస్తున్నాం అని చెప్పారు. మా జీతాల్లో కోతలు వేసుకుని ఆ డబ్బులు మిగుల్చుకుంటున్నారు అని వాపోయారు. చిత్తశుద్ధితో, నిజాయితీతో ఒక అడుగు ముందుకు వస్తే మేము నాలుగు అడుగులు ముందుకి వేస్తామన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తీసుకు రావొద్దని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. మంత్రులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. తమ తరపున చర్చలకు ఎవరు వస్తే మీకెందుకు...? ముందు మీ బాధ్యత ముందు నెరవేర్చండి అని అన్నారు. ఎస్మా చట్టానికి భయపడేది లేదని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+