లోకేష్ కుతంత్రాల‌కు పాల్ప‌డితే...జ‌గ‌న్ లా పారిపోను..ఏదైనా జ‌రిగితే డిజిపి దే బాధ్య‌త‌...

Recommended Video

    AP 2019 Elections : టిడిపి త్వ‌ర‌లో జ‌గ‌న్‌తోనూ పొత్తు పెట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్ | Oneindia

    జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ముగ్గురిని ల‌క్ష్యంగా చేసుకొని త‌న ప్ర‌సంగాలు కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ అసెంబ్లీకి హాజ‌రు కాక‌పోవ‌టాన్ని ప‌దే ప‌దే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. లోకేష్ పైనా విమ‌ర్శ‌లు త‌గ్గ‌టం లేదు. తాజాగా, త‌న కాన్వాయ్ కు...అదే విధంగా పార్టీ నేత మ‌నోహ‌ర్ కారుకు ప్ర‌మాదం జ‌రిగిన తీరు ను ప‌వ‌న్ వివ‌రించారు. తాను జ‌గ‌న్ లాగా కోడి క‌త్తి గుచ్చుకోగానే హ‌డావుడి చేయ‌లేదంటూనే...లోకేష్ మీరు పార్టీ న‌డిపే వ్య‌క్తి..ఇలాంటి కుతంత్రాల‌కు పాల్ప‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. త‌న‌కు ఏదైనా జ‌రిగితే డిజిపి దే బాధ్య‌త అని ప‌వ‌న్ హెచ్చ‌రిస్తున్నారు...

    బాబు - లోకేష్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు...

    బాబు - లోకేష్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు...

    ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ప‌ర్య‌ట‌న లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..మంత్రి లోకేష్ ను నిరంర‌తం టార్గెట్ చేస్తున్నారు. రాజ‌కీ యం గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు కు వ‌య‌సు అయిపోయింద‌ని..ఆయ‌న ఇక పాల‌న‌కు ప‌నికిరార‌ని ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నారు.

    ఇక‌, తాజాగా త‌న కాన్వాయ్ కు జ‌రిగిన ప్ర‌మాదం పైనా వ‌ప‌న్ స్పందించారు. త‌న కాన్వాయ్ కు ప్ర‌మాదం జ‌రిగితే తాను జ‌గ‌న్ లా కోడిక‌త్తి గుచ్చారు..గుచ్చారు అని రాజ‌కీయం చేయ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు..జ‌గ‌న్ కు తెలంగాణ లో తిరిగలేర‌ని ఎద్దేవా చేసారు. ఇక‌, ఒకే రోజు త‌న వారికి రెండు ప్ర‌మాదాలు జ‌రిగాయాని..కాన్వాయ్ కు ప్రమాదం....అదే రోజు పార్టీ నేత మ‌నోహ‌ర్ కారును ఇసుక లారీ గుద్దేసింది..అది ఉద్దేశ‌పూర్వ‌క‌మో..యాధృచ్చిక‌మె అంటూనే.. తాను వీటి పై రాజ‌కీయం చేయ‌న‌ని చెబ‌తూనే బాబు లోకేష్‌..పార్టీ న‌డపాల్సిన వ్య‌క్తివి..కుతంత్రాల‌కు పాల్ప‌డితే ఎలా ప్ర‌శ్నించ‌టం కొస మెరుపు...పరోక్షంగా లోకేష్ ను ఈ విష‌యంలో ప‌వ‌న్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ ను తిట్టిన టిడిపి ఇప్పుడు వారిని మోస్తుంద‌ని..త్వ‌ర‌లో వారు జ‌గ‌న్‌తోనూ పొత్తు పెట్టుకుంటార‌న్నారు.

    జ‌గ‌న్ పై పెరిగిన స్వ‌రం...

    జ‌గ‌న్ పై పెరిగిన స్వ‌రం...

    జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ కొద్ది రోజులుగా వైసిపి అధినేత జ‌గ‌న్ పై త‌న స్వ‌రం పెంచారు. జ‌గ‌న్ ను కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే విమ‌ర్శించే ప‌వ‌న్‌..ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ టార్గెట్ చేస్తున్నారు. తాను జ‌గ‌న్ లా పారిపోన‌ని..ఎమ్మెల్యేల‌ను కాపాడుకోలేని వ్య‌క్తి జ‌గ‌న్ అని ఎద్దేవా చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా వెళ్లిపోయినా తాను ఒక్క‌డినే అసెంబ్లీకి వెళ్లేవాడినంటూ ప‌వ‌న్ చెబుతున్నారు. ఇక‌, కోడిక‌త్తి వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ రాజ‌కీయంగా చేస్తున్నార ని ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ లాగా తాను వేల కోట్లు దోచుకోవ‌టానికి రాలేద‌ని..తండ్రిని అడ్డు పెట్టుకొని జ‌గ‌న్ వేల కోట్లు దండుకున్నార‌ని ఆరోపించారు. తాను అవినీతికి వ్య‌తిరేకంగా పోరాండేందుకు వ‌చ్చాన‌ని చెప్పుకొస్తున్నారు. వ‌చ్చి పోరాటం చేయండి..బ‌య‌ట‌కు వ‌చ్చి తోలు తీయండి..ఆ ధైర్యం మీకు లేదు..మీరు పారిపోతున్నారంటూ జ‌గన్ ను ప‌వ‌న్ ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శలు ఎక్కు పెడుతున్నారు.

    ఏం జ‌రిగినా డిజిపిదే బాధ్య‌త‌...సీయం అవుతా..

    ఏం జ‌రిగినా డిజిపిదే బాధ్య‌త‌...సీయం అవుతా..


    త‌మ పార్టీ నేత‌ల‌కు ఏం జ‌రిగినా డిజిపి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. తెలుగుదేశం పార్టీకి ఎలాగో బాధ్య‌త లేద‌ని..శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన బాధ్య‌త డిజిపిదే అని స్ప‌ష్టం చేసారు. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లినా ఎమ్మెల్యేల అవినీతి క‌నిపిస్తోంద‌ని..అవినీతి ఎమ్మెల్యేల ప‌ని ప‌డ‌తాన‌ని హెచ్చ‌రించారు. వంద‌కోట్లు వ‌చ్చే ఆదాయాన్ని వ‌ద్ద‌నుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని..తాను సీయం అవుతాన‌ని ప‌వ‌న్ ధీమా వ్య‌క్తం చేసారు. కొద్ది రోజుల క్రితం రైళ్లో ప్ర‌యాణించిన ప‌వ‌న్‌..ఇప్పుడు రాజ‌మండ్రి నుండి రంప‌చోడ‌వరం వ‌ర‌కు ఆర్టీసి బ‌స్‌లోప్ర‌యాణించి సామమాన్యుల‌తో మ‌మేకం అయ్యేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+