చింత‌మ‌నేని పై ప‌వ‌న్ వ‌దులుతున్న బాణం..! మ‌హిళా అభ్య‌ర్థితో చెక్ పెడుతున్న గబ్బ‌ర్ సింగ్..!!

Recommended Video

    చింత‌మ‌నేని పై పోటీ కి.... మ‌హిళా అభ్య‌ర్థిని నిలబెట్టిన పవన్..!! | Oneindia Telugu

    అమరావతి/హైద‌రాబాద్ : ఏపి ఎన్నిక‌ల్లో జ‌న‌సైనికుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ని మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల్లో మార్పు తెస్తాన‌న్న ప‌వన్ ఆదిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. 'చింతమనేని లాంటి రౌడీని ఓడించడానికి ఒక వీరమహిళను నిలబెడతాను'అంటూ గతంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నంత పనీ చేశారు.

    దెందులూరు నియోజకవర్గం నుంచి జనసేన తరపున సామజిక ఉద్యమకారిణి ఘంటశాల వెంకటలక్ష్మిని బరిలో దింపారు. ఘంటశాల వెంకటలక్ష్మి, మహిళలు, బీసీల సాదికారిత కోసం ఉద్యమ బాటలో వున్నారు. సారా వ్యతిరేక ద్యమంలో పాల్గొన్నారు. ఐద్వా తరపున సామాజిక అంశాలపై ఆందోళనను చేపడుతుంటారు. ఇక ఏపీలో వివాదాస్పద రాజ‌కీయ నేత‌ల్లో చింతమనేని ప్రభాకర్ ముందుంటారు కాబ‌ట్టి ఆయ‌న‌ను మొద‌ట‌గా టార్గెట్ చేసారు జ‌న‌సేనాని.

    Pawans political arrow on chinthamaneni prabhakar..! does it target.??

    దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర చౌద‌రిపై అనేక వివాదాలు ఉన్నాయి. ఇక్కడ అంతా అయన ఇష్టారాజ్యమే. ఎప్పుడూ ఎదో అంశం వివాదం చేస్తూ, చింతమనేని తరచూ సంచ‌ల‌నాలు చేస్తుంటారు. గతంలో అయన మాజీ మంత్రి వ‌ట్టి వసంత్ కుమార్ మీద చేయిచేసుకున్నారు. ఎమ్ార్వో వనజాక్షి మీద దౌర్జన్యం చేసి వార్తల్లోకి ఎక్కారు.

    దళితుల్ని ఇటీవల అనరాని భాషలో దుర్భాషలాడారు. ఆయన నోటి దురుసుకి అందరు భయపడతారు. అటు వైసీపీకి, ఇటు జనసేనకు కూడా సవాల్ గా మారిన చింతమనేని ప్రభాకర్ పై పోటీ పడే దేవరో తేలిపోయింది. వైసీపీ తరపున కొటారు అబ్బయ్య చౌదరి బరిలో దిగా చంద్రబాబు చేస్తోన్న విమర్శలపై తొలిసారిగా నోరు విప్పిన ప్రశాంత్ కిశోర్

    రు. జనసేన తరపున ఘంటశాల వెంకటలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఐతే అర్థ‌బ‌లం, అంగ‌బ‌లం మెండుగా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రిని దెబ్బ‌తీయండం జ‌న‌సేన అభ్య‌ర్థురాలు వెంక‌ట లక్ష్మీకి క‌త్తిమీద సాములాంటిదే..!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+