• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గంటా ప‌క్షిలా ఎగిరిపోతారు : వెన్నుపోటు పొడిపించుకొనే బ‌ల‌హీనుడిని కాదు : ప‌వ‌న్ సంచ‌ల‌నం..!

|

ఒక‌నాటి ప్ర‌జారాజ్యం నేత‌..నేటి టిడిపి మంత్రి గంటా పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేసారు. గంటా ను ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు విశాఖ జిల్లాలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న లో భాగంగా గంటాను జ‌న‌సేన లో చేర్చుకొనే అంశం పై చ‌ర్చ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ ఈ కీల‌క వ్యాఖ్య‌ల‌ను చేసారు. అదే స‌మ‌యంలో వెన్నుపోటు పొడిపించుకొనేంత బ‌ల‌హీనుడిని కాద‌ని పేర్కొన్నారు.

గంటా ప‌క్షిలాంటి వారు..

గంటా ప‌క్షిలాంటి వారు..

మంత్రిగా గంటా శ్రీనివాస రావు ప‌క్షి లాంటి వార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ నేత ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా మంత్రి గంటాను పార్టీలోకి ఆహ్వానించ‌టం పై చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ తీవ్రంగా స్పందించారు. మంత్రి గంటా శ్రీనివాస‌రావును జ‌న‌సేన పార్టీలోకి ఆహ్వానించేది లేద‌ని తేల్చి చెప్పారు. గం టా పై త‌న‌కు కోపం లేద‌ని చెబుతూనే..గంటా ఆలోచ‌నా ధోర‌ణి జ‌న‌సేన‌కు స‌రిప‌డ‌ద‌ని చెప్పుకొచ్చారు. గంటా లాంటి వ్య‌క్తులు ప‌క్షుల్లా వ‌చ్చి ఎగిరిపోతార‌ని..అలాంటి ప‌క్షుల‌న న‌మ్మ‌ను అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారి గా జిల్లా పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో చ‌ర్చ మొద‌లైంది. జ‌న‌సేన పార్టీలోకి గంటా వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేసార‌ని..ప‌వ‌న్ అందు కు అంగీక‌రించ‌లేద‌ని జిల్లాలో ప్ర‌చారం జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో గంటా కు స‌న్నిహితంగా ఉన్న కొంద‌రు ప‌వ‌న్ వ‌ద్ద గంటా అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న సీరియ‌స్ గా రియాక్ట్ అయిన‌ట్లు స‌మాచారం.

పీఆర్పీ నుండి ఎన్నిక‌..చిరంజీవికి స‌న్నిహితుడిగా..

పీఆర్పీ నుండి ఎన్నిక‌..చిరంజీవికి స‌న్నిహితుడిగా..

గంటా శ్రీనివాస రావు 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం లో చేరారు. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి నుండి శాస‌న‌స‌భ‌కు ఎన్నికయ్యా రు. ఆ త‌రువాత చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. చిరంజీవి సన్నిహితుడిగా ఉంటూ నాటి కిర‌ణ్ క్యాబినెట్‌లో సి రామ‌చంద్ర‌య్య‌, గంటా శ్రీనివాస రావు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఆ త‌రువాత పూర్తి గా కాంగ్రెస్ నేత‌లు..ఎన్నిక‌ల ముందు టిడిపి నేత‌లకు ద‌గ్గ‌ర‌య్యారు. జ‌న‌సేన స్థాప‌న స‌మ‌యంలో ఆయ‌న వ‌ప‌న్ తో క‌లుస్తార‌ని అంద‌రూ భావించారు. అయితే, మంత్రిగా ఉన్న గంటా జ‌న‌సేన వైపు చూడ‌లేదు. ఆ త‌రువాతి కాలంలో కొన్ని సంద‌ర్భాల్లో జ‌నసేన పై విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, కొద్ది కాలం క్రితం గంటా త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి జ‌న‌సేన లో చేరాల‌ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అందుకు ప‌వ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. తిరిగి ఇప్పుడు గంటా ప్ర‌స్తావ‌న వ‌చ్చిన సంద‌ర్భాలో ప‌వ‌న్ త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టంగా చెప్పేసారు.

వెన్నుపోటు పొడిపించుకొనే బ‌ల‌హీనుడిని కాదు..

వెన్నుపోటు పొడిపించుకొనే బ‌ల‌హీనుడిని కాదు..

గంటా ప్ర‌స్తావ‌న వ‌చ్చిన స‌మ‌యంలోనే ప‌వ‌న్ మరిన్ని వ్యాఖ్య‌లు చేసారు. మెగా సోద‌రులు గంటాకు ప్రాధాన్య‌త ఇ చ్చారు. అయితే, గంటా మాత్రం రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా అడుగులు వేయ‌టాన్ని ప‌వ‌న్ కు న‌చ్చ‌లేదు. దీంతో వెన్నుపోటు న‌డిపించుక‌నే బ‌ల‌హీనుడిని కాదంటూ సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసారు. లోకేష్ - జ‌గ‌న్ లాంటి వారు రాజ‌కీయాల‌ను వార‌స‌త్వ‌పు హ‌క్కుగా భావిస్తార‌ని పేర్కొన్నారు. నీతిపరులు, అవినీతిపరులు అని విడదీసుకుంటూ పోతే రాజకీయాలు చేయలేం. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలో దిగక తప్పదు. అందులో కమ లంలా జనసేనను వికసింపజేస్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో..ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో కొంద‌రు నేత‌లు చిరంజీ విని వెన్నుపోటు పొడిచార‌నే భావ‌న ప‌వ‌న్ మాటల్లో వ్య‌క్తం అయింద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌జారాజ్యం లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను పున‌రావృతం కాకుండా ప‌వ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

English summary
Janasena Chief Pawan Kalyan serious comments on minister Ganta Srinivasa rao in Visakha. Pawan says cant believe such persons in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X