ఏపి బ‌డ్జెట్‌: 2.26 ల‌క్ష‌ల కోట్ల‌తో ప్ర‌తిపాద‌న‌లు : కొత్త ప‌ధ‌కాలు ఉంటాయా..!

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం నూతన బ‌డ్జెట్ ను ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌వేశ పెడుతోంది. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ అ యి నా..పూర్తి స్థాయి ప్ర‌తిపాద‌న‌ల‌తో బడ్జెట్ ను సిద్దం చేసారు. అందులో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ ను స‌భ ఆమోదించ‌నుంది. అయితే, కొత్త ప‌ధ‌కాలు ఉంటాయా..లేక టోకెన్ గ్రాంట్‌గా రైతుర‌క్ష లాంటి ప‌ధ‌కాల‌కు కేటా యింపులు చేస్తారా అనేది చూడాలి.

2.26 ల‌క్ష‌ల‌తో బ‌డ్జెట్..!

2.26 ల‌క్ష‌ల‌తో బ‌డ్జెట్..!

ఏపి ప్ర‌భుత్వం అయిదేళ్ళ కాలంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చెబుతున్న అభివృద్ది - సంక్షేమం క‌ల‌గ‌లిపి 2019-20 బ‌డ్జెట్ ను ఏపి ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, ఆర్థికశాఖ అధికారులు పూర్తిస్థాయిలో 2019-20 సంవత్సరానికి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు.

రూ.2.40 లక్షల కోట్ల ప్రతిపాదనలు

రూ.2.40 లక్షల కోట్ల ప్రతిపాదనలు

అన్ని శాఖల నుంచి మొత్తం రూ.2.40 లక్షల కోట్ల ప్రతిపాదనలు రాగా.. ఆర్థికమంత్రి ఆదేశాల మేరకు రూ.2.26 లక్షల కోట్లకు వాటిని కుదించారు. ఈ మొత్తం బడ్జెట్‌లో 4 నెలల కాలానికి సరిపడా బడ్జెట్‌ను (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌) ఉభయ సభలు ఆమోదించనున్నాయి. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.1.96 లక్షల కోట్లకు సవరించారు. దీన్ని మొదట రూ.1.91 లక్షల కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలి సిందే. గ్రామీణాభివృద్ధికి అత్యధికంగా సుమారు రూ.32వేల కోట్లు, జలవనరులశాఖకు రూ.16వేల కోట్లు, వ్యవసాయం-దాని అనుబంధ రంగాలకు రూ.15వేల కోట్ల చొప్పున నిధులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

కొత్త ప‌ధ‌కాలు ప్ర‌క‌టిస్తారా..!

కొత్త ప‌ధ‌కాలు ప్ర‌క‌టిస్తారా..!

ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టంతో ఏపి ప్ర‌భుత్వం కొత్త ప‌ధ‌కాలు ప్ర‌క‌టిస్తుందా లేదా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇప్పటికే నిరుద్యోగ భృతి, ఆదరణ, డ్వాక్రా మహిళలకు రూ.10,000 కానుక, పెన్షన్ల రెట్టింపు లాంటి కొత్త పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.10,000 కానుకను మూడు విడతలుగా ఇవ్వనుంది. ఇందులో రెండు విడతలుగా ఇచ్చే రూ.6,000ను ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో, మూడో విడతగా ఇచ్చే రూ.4,000ను 2019-20 పూర్తిస్థా యి బడ్జెట్లో చేర్చే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ప్రకటించి అమలు చేస్తున్న పథకాలకు తప్ప... ఓటాన్‌ అకౌంట్‌ కాలానికి సంబం ధించి కొత్తగా ఏ పథకాలనూ ప్రభుత్వం ప్రకటించదని స‌మాచారం. కౌలు రైతులకు కూడా ప్రయోజనాలు కలిగించేలా ‘రైతురక్ష' పథకాన్ని రూపొందించి మేనిఫెస్టోలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఆ పథకం అమలుకు టోకెన్ గ్రాంట్ ఇచ్చే అవ‌కాశం ఉందని చెబుతున్నారు. నెలకు రూ.1000 అందిస్తున్న నిరుద్యోగభృతిని 2వేలకు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, వచ్చే పూర్తి ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో..మొత్తంగా బ‌డ్జెట్ ఏ ర‌కంగా ఉంటుంద‌నే దాని పై ఆస‌క్తి మొద‌లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+