తెలుగు అకాడమీ స్కాం ట్విస్ట్.. ఏపీలో కూడా, 2 సంస్థలను ఛీట్.. సాయి రాం..?
తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంస్థల నుంచి సాయి కుమార్ ముఠా డబ్బులు కొట్టేసినట్టు తేలింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ 10 కోట్ల రూపాయలు కోట్టేశారని తెలిసింది. ఆంధ్ర ప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ నుంచి ఐదు కోట్ల ఎఫ్‌డీలను డ్రా చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రెండు సంస్థ ల నుంచి మొత్తం 15 కోట్ల రూపాయలను సాయికుమార్ డ్రా చేసినట్టు దర్యాప్తులో తేలింది.
ఏపీ సంస్థల సంబంధించిన డిపాజిట్లను ఐఓబి బ్యాంక్ నుంచి సాయికుమార్ ముఠా బదలీ చేయించుకుంది. ఐఓబి నుంచి ఏపీ మర్కంటైల్ కోపరేటివ్ సొసైటీ కి నిధులు బదిలీ చేయించుకుని.. ఆ తర్వాత విత్ డ్రా చేసింది. ఏపీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసి నట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. సాయికుమార్ ముఠాపై 2 కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తెలుగు అకాడమీలో మాయమైన 60 కోట్ల రూపాయల రికవరీపై పోలీసులు దృష్టిసారించారు.

అంతకుముందు తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్ చేశామని, రిమాండ్ రిపోర్టులో సీసీఎస్ పోలీసులు తెలిపారు. కీలక సూత్రదారి సాయికుమార్‌గా పోలీసులు తేల్చారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు.
భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ చూశారని వివరించారు. ఏడాది నుంచి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందని అన్నారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్‌లు డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. 64.5 కోట్లను కొల్లగొట్టి నిందితులు వాటాలు పంచుకున్నారని, 20 కోట్లు సాయి కుమార్, 7 కోట్లు వేంకటరమణ, 3 కోట్లు రాజ్ కుమార్, 3 కోట్లు వేంకటేశ్వర్ రావు, 6 కోట్లు కృష్ణారెడ్డి, 2.5 కోట్లు భూపతి, 6 కోట్లు రమణా రెడ్డి, 50 లక్షలు పద్మనాభన్, 30 లక్షలు మదన్, 10 కోట్లు సత్యనారాయణ, 2.5 కోట్లు మస్తాన్ వలీ, 2 కోట్లు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, 50 లక్షలు యోహన్ రాజు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఏపీలో జరిగిన స్కాం వెలుగుచూసింది.












Click it and Unblock the Notifications